twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఈగ’తో ‘మగధీర’ను పోల్చి చూడలేం: రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'మగధీర' కూడా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నేషనల్ అవార్డు అందుకుంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా 'ఈగ'తో 'మగధీర'ను పోల్చి చూడలేం. 'మగధీర' స్థాయి ఎఫెక్ట్స్‌ని ఇప్పుడు చూపిస్తే జనాలు పెద్దగా ఆసక్తి చూపరు. రెండేళ్ల తర్వాత 'ఈగ' రేంజ్‌లో చూపిస్తే కూడా పెదవి విరుస్తారు. ఆరు నెలలకోసారి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా స్టాండర్ట్స్ మారిపోతుంటాయి అన్నారు రాజమౌళి. 'ఈగ'కు రెండు జాతీయ పురస్కారాలు లభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే... గ్రాఫిక్స్ విషయంలో భారతదేశం ప్రపంచదేశాల్లో చాలా ముందుందనే చెప్పాలి. మీరు ప్రపంచవ్యాప్తమైన గొప్ప సినిమాలు ఏవైనా తీసుకోండి. పైరేట్స్ ఆఫ్‌ది కరేబియన్, లైఫ్ ఆఫ్ పై ఇలా ఏ సినిమా తీసుకున్నా.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇండియన్స్ పాత్ర చాలానే ఉంది. అందరూ అని చెప్పను. ప్రపంచవ్యాప్తంగా విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి సినిమాలు తీసే ఎక్కువ మంది దర్శక, నిర్మాతలు ఇండియన్ టెక్నీషియన్స్‌పై ఆధారపడాల్సిందే. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ఉండాలి? ఈ రకంగా ముందుకెళ్లాలి అని వివరించి మంచి ప్రొడక్ట్‌ని తీసుకొచ్చే మార్గనిర్దేశకులు మాత్రం మనకు లేరు. 'ఈగ' సినిమా విషయంలో ఆ బాధ్యతను పీట్ డ్రాపర్ నిర్వర్తించారు అని చెప్పారు.

    ఇక 'ఈగ' విజువల్ ఎఫెక్ట్స్‌కి తప్పకుండా అవార్డు వస్తుందని ముందే ఊహించాం. విజువల్ ఎఫెక్ట్స్‌లో రెండు విభాగాలుంటాయి. అందులో మొదటి విభాగం మామూలుగా మనం చూసే గ్రాఫిక్స్ అయితే, రెండోది ఒక ప్రాణికి యాక్షన్స్ క్రియేట్ చేయడం. దాన్ని క్రీచర్ యానిమేషన్ అంటారు. ఈ రెండో విభాగం ఇండియాలో చాలా తక్కువ. గ్రాఫిక్స్ విషయంలో ఇండియాకు మంచి పేరుంది కానీ, యానిమేషన్ విషయం మాత్రం పెద్దగా మనకు గుర్తింపు లేదు. కానీ 'ఈగ' వచ్చిన తర్వాత యానిమేషన్ ప్రపంచంలోనే మనకు ఓ గుర్తింపు వచ్చింది. మకుట విఎఫ్‌ఎక్స్ వారు గ్రాఫిక్స్ పరంగా, యానిమేషన్ పరంగా అంత అద్భుతమైన పనితనం చూపించారు అన్నారు.

    English summary
    Rajamouli says that there is so much differnce between Eega and Maghadheera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X