వారికి రాజమౌళి సీరియస్ వార్నింగ్
''ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో దోషుల్ని పట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. వీడియోలు అప్‌లోడ్ చేయడమే కాదు, డౌన్‌లోడ్ చేయడం కూడా నేరమే. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి...పైరసీకి పాల్పడినవారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఇది వరకు కాపీరైట్ చట్టం ప్రకారమే కేసులుండేవి. కానీ ఇకపై క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేయించబోతున్నామ''అంటూ సీరియస్ గా పైరసీ చేసే వారికి వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఈగ' సినిమా పైరసీకి గురయ్యింది. ప్రింట్‌పై ఉన్న ఫోరెన్సిక్ వాటర్ మార్క్ ఆధారంగా చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని గౌరీశంకర్ థియేటర్‌లో పైరసీకి పాల్పడినట్టు నిర్మాతలు పసిగట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఇలా స్పందించారు.
సురేష్‌బాబు మాట్లాడుతూ ''''ఈగ' తమిళ వెర్షన్ 'నాన్ ఈ' సినిమా రేపు విడుదల అనగా... తెల్లవారుజామున 2గంటల 58 నిమిషాలకే పైరసీ చేసేశారు. ఇది కేవలం థియేటర్ యాజమాన్యాల నిర్లక్ష్యమే. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఆధారలతో సహా పట్టుకోవడం జరిగింది. థియేటర్లలో యథేచ్ఛగా పైరసీ జరుగుతోందనే విషయం ఇదివరకే మా దృష్టికొచ్చింది. వరదయ్యపాలెంలోని థియేటర్‌ని సీజ్ చేసి, యజమానిని అరెస్టు చేశారు అన్నారు.
అలాగే పైరసీ చేసిన సీడీల్ని ఎక్కడికి పంపించారనే విషయాన్ని కూడా త్వరలోనే కనుక్కొంటాం. కోయంబత్తూరులోని ఓ థియేటర్‌లో తమిళంలో విడుదలైన 'ఈగ' సినిమాని పైరసీ చేశారు. హుబ్లీలోని శ్రీవజ్రేశ్వర థియేటర్‌లోనూ 'ఈగ' చిత్రాన్ని పైరసీ చేశారు. ఏ రోజు, ఎన్ని గంటలకు సినిమాని రికార్డ్ చేశారనే విషయం కూడా బయటపడింది. దీంతో వీరందరిపై త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నాం. విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సినిమా డౌన్‌లోడ్ చేసుకొన్నట్టు తెలిస్తే ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇస్తాము''అన్నారు సురేష్ బాబు. బూరుగుపల్లి శివరామకృష్ణ, సి.కల్యాణ్, సాయి కొర్రపాటి, విజయేందర్‌రెడ్డి, స్రవంతి రవికిషోర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











