ఫ్యాన్సే హడావిడి చేస్తారు.. చిన్నప్పటి నుంచే అలా అనుకునే వాడిని.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్

రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) అంటూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినా, రామరాజు కోసం భీమ్ అంటూ అల్లూరి సీతారామరాజును పరిచయం చేసినా అందులో రాజమౌళి పనితనమే కనిపిస్తుంది. ఆ రెండింటిలోనూ రాజమౌళి మార్కే కనిపిస్తుంది. బాహుబలి తరువాత దర్శకధీరుడు చేస్తున్న చిత్రం కావడం, యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉండేవి. అవి ఇప్పుడు పదింతలు పెరిగాయి. తాజాగా రాజమౌళి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.

 చాలా ఆలోచించాం..

చాలా ఆలోచించాం..

కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తూ ఉంటే ఆర్ఆర్ఆర్ అప్‌డేట్స్ రిలీజ్ చేయాలా? వద్దా? అని చాలా ఆలోచించామని చెప్పుకొచ్చాడు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలన్నదే ప్రభుత్వాల ఉద్దేశ్యంతో వారికి ఎంటర్టైన్మెంట్ ఇస్తే.. ఇంట్లోనే కూర్చుని చూస్తారుగా అని ఫిక్స్ అయి.. ఆర్ఆర్ఆర్ అప్‌డేట్స్ ఇచ్చేశామని అన్నాడు.

ఫ్యాన్సే హడావిడి చేస్తారు..

ఫ్యాన్సే హడావిడి చేస్తారు..

అయితే సినిమాను చూసే జనం ఎక్కువ.. కానీ వారు తక్కువగా మాట్లాడతారు.. ఫ్యాన్స్ ఉండేది తక్కువ కానీ వారు ఎక్కువ మాట్లాడతారని పేర్కొన్నాడు. అయితే ఎక్కువగా జనాన్ని మెప్పించేలా సినిమా తీస్తే వారికి కూడా నచ్చుతుందని, అందుకే తాను ఫ్యాన్స్ వార్ ఎక్కువగా పట్టించుకోనని చెప్పుకొచ్చాడు.

అలా అనుకునేవాడిని..

అలా అనుకునేవాడిని..

చిన్నతనంలో కామిక్ బుక్స్ లేదా ఏదైనా స్టోరీ చదివేటప్పుడు.. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కలిసి వస్తే ఎలా ఉంటుంది.. లేదా భీమ్, హనుమాన్ కలిసి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు అప్పటి నుంచే ఉన్నాయి. అలా ఇద్దరు శక్తివంతమైన వారు కలిస్తే ఓ రేంజ్ ఉంటుందని తెలిపాడు.

Recommended Video

RRR | Audience Blown Away By Jr NTR Voice Over
 ఆర్ఆర్ఆర్‌కు అన్నీ కుదిరాయి..

ఆర్ఆర్ఆర్‌కు అన్నీ కుదిరాయి..

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్‌కు సెట్ కావడంపై మాట్లాడుతూ.. వారిద్దరితో గతంలో తాను పనిచేశానని, రెండూ పెద్ద ఫ్యామిలీలే కావడం, ఆ రెండింటి మధ్య బయట గొడవలున్నా వారిద్దరూ మంచి స్నేహితులే కావడం ఇలా తనకు అన్ని కలిసి వచ్చాయని అలా ఆర్ఆర్ఆర్ కుదిరిందని తెలిపాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X