»   »  ఐస్‌క్రీమ్‌ లో ఆవకాయే కలిపినట్లే: రాజమౌళి

ఐస్‌క్రీమ్‌ లో ఆవకాయే కలిపినట్లే: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఏ సినిమాకైనా ప్రీవిజువలైజేషన్‌ ముఖ్యం. 'బాహుబలి' లాంటి సినిమాలకైతే అదే ప్రాణం. చివరిగా తెరపై సన్నివేశం ఎలా కనిపించాలో ముందుగానే వూహించడం అన్నమాట. అలా వూహించాలంటే ఛాయాగ్రాహకుడు, కళా దర్శకుడు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌... ఈ నలుగురికీ ఒకళ్ల పని మీద మరొకరికి అవగాహన ఉండాలి. అక్కడ సమన్వయం లేకపోతే మాత్రం వ్యవహారం ఐస్‌క్రీమ్‌, ఆవకాయ కలిపినట్టుగా తయారవుతుంది ' అని రాజమౌళి అన్నారు.

రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి' జులై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో రాజమౌళి మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఆరేళ్ల ఆలోచన, మూడేళ్ల కష్టం, రూ. రెండొందల కోట్ల వ్యయం.. తో రూపొందిన ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే... కేవలం పాత్రల డిజైనింగ్‌కే రెండు వేలకు పైగా స్కెచ్చులు వేశాం. కథ తొందరగానే సిద్ధమైంది కానీ... ఆ కథని మేం అనుకొన్నట్టుగా తీయడం కోసం అందరూ సిద్ధం కావడానికి ఏడాది సమయం పట్టింది. ప్రీప్రొడక్షన్‌ కోసం అంత సమయం కేటాయించడం ఇటీవల కాలంలో ఏ సినిమాకీ జరగలేదేమో అన్నారు.


Rajamouli about his latest Baahubali

ఇక ఈ సినిమాలో కనిపించే ప్రతీ ఆయుధానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా పాత్రల స్వభావానికి తగ్గట్టుగా ఆయుధాలను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించాం. వాటి కోసం చాలామంది డిజైనర్లు పని చేశారు అని చెప్పుకొచ్చారు.


రోజులు గడుస్తున్న కొద్దీ రాజమౌళి కలల వెంచర్ ‘బాహుబలి' పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సౌండ్ ఇంజనీరింగ్ లో జాతీయ అవార్డు గ్రహిత పి.ఏం సతీష్ సారధ్యంలో డాల్బీ అట్మాస్ సౌండ్ పరిజ్ఞానంలో విడుదలకానుంది.


ఈ డాల్బీ అట్మాస్ పరిజ్ఞానంద్వారా 3D సౌండ్ అనుభూతికలుగుతుంది. రియాలిటీకి దగ్గరగా వున్న ఈ పరిజ్ఞానాన్ని ఇదివరకు విశ్వరూపం సినిమాకు ఉపయోగించారు. ఇటువంటి ప్రయోగం చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం


‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి' . ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.


పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

English summary
Furious sketching, endless discussion sessions, 25 artists at work - that's how SS Rajamouli's dream project Baahubali is coming to life. Baahubali (One with Strong Arms) is an upcoming epic action Telugu film starring stars Prabhas (protagonist) and Rana Daggubati (antagonist). It also features Anushka Shetty and Tamannaah as the lead heroines, with both playing warrior princesses.
Please Wait while comments are loading...