twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జింతాతా’ టైటిల్ ఇంకా ఖరారు కాలేదు: రాజమౌళి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'విక్రమార్కుడు' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా 'విక్రమార్కుడు' చిత్రానికి సీక్వెల్‌ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి వద్ద గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కోటి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈగ చిత్రం నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బేనర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తారు. విక్రమార్కుడు చిత్రానికి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ఈచిత్రానికి కూడా మ్యూజిక్ ఇస్తారని తెలుస్తోంది. జనవరి నెలలో ఈచిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారని, అప్పుడు అన్ని విషయాలు తెలియజేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

    'జింతాతా' అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనున్నట్లు వస్తున్న వార్తలపై రాజమౌళి స్పందించారు. 'జింతాతా' టైటిల్ ఇంకా ఖరారు కాలేదని, పరిశీలనలో ఉందని, ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి టైటిల్ మార్చే అవకాశం కూడా లేక పోలేదని రాజమౌళి స్పష్టం చేసారు.

    రాజమౌళి ఆశీస్సులతోనే ఈచిత్రం సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది.... రాజమౌళి దర్శకత్వం కాక పోయినా రాజమౌళి దగ్గర పని చేసిన అనుభవంతో ఆ రేంజిలో సినిమాను తీయడానికి కోటి ప్లాన్ చేసుకుంటున్నాడు. 'జింతాతా' చిత్రం కోసం రాజమౌళి సలహాలు కూడా తీసుకుంటున్నాడు కోటి.

    ఇటీవల విడుదలైన నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు సినిమాలతో పరాజయం చవి చూసిన రవితేజ ప్రస్తుతం 'సార్ వచ్చారు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా 'బలుపు' అనే మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్న 'బలుపు' చిత్రం షూటింగుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్లో ఈచిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది.

    English summary
    It is heard that plans have begun to make a sequel to blockbuster movie ‘Vikramarkudu’ and this has been titled as ‘Jinthatha..’. the movie will be directed by ace director SS Rajamouli’s former assistant Koti and will be produced by Sai Korrapati of Eega and Andala Rakshasi fame under Vaarahi Chalana Chitram Banner. Rajamouli has revealed that the title has not been finalized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X