»   » మహాభారతంపై రాజమౌళి క్లారిటీ: మోహన్ లాల్ 1000 కోట్ల ప్రాజెక్టుపై స్పందన!

మహాభారతంపై రాజమౌళి క్లారిటీ: మోహన్ లాల్ 1000 కోట్ల ప్రాజెక్టుపై స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన జీవిత లక్ష్యం మహాభారతం సినిమా తీయడమే.... అని పలు సందర్భాల్లో రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మహాభారతం మొదలు పెట్టక ముందే మోహన్ లాల్ హీరోగా రూ. 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతం మొదలు కావడం కాబోతుండటంపై రకరకాల ప్రచారం జరిగింది. దీనిపై రాజమౌళి స్పందించారు.

నేను వివిధ సందర్భాల్లో చెప్పింది... రకరకాలుగా ఎటో ఎటో వెళ్లి పోయంది. మహాభారతం అనేది నా లక్ష్యం... ఆ సినిమా చేయడం నాకు ఇష్టమని చాలా సార్లు చెప్పాను. దీంతో బాహుబలి తర్వాత మహాభారతం చేస్తానని వార్తలు వచ్చాయి. దాంటో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ యాక్ట్ చేస్తున్నాడట అని రకరకాలుగా రాసారు అని రాజమౌళి తెలిపారు.


బాబులూ.. తండ్రులూ ఇపుడు మహాభారతం తీయడం లేదు

బాబులూ.. తండ్రులూ ఇపుడు మహాభారతం తీయడం లేదు

బాబులూ.. తండ్రులూ ఇపుడు మహాభారతం తీయడం లేదు నా లైఫ్ ఎయిమ్ అది. అది తీసే స్కిల్ రావడానికి ఓ పది సంవత్సరాలు పడుతుంది నాకు. ఇపుడు కాదు అని చెప్పాను. మనం చెప్పింది వారు వినరు కదా... వాళ్లకు ఏది నచ్చితే అది రాసేస్తూ ఉంటారు.. అని మీడియాను ఉద్దేశించి రాజమౌళి అన్నారు.


మోహన్ లాల్ 1000 కోట్ల ప్రాజెక్టుపై ఇలా

మోహన్ లాల్ 1000 కోట్ల ప్రాజెక్టుపై ఇలా

మొన్నీమధ్య న్యూస్ చూసాను. మోహన్ లాల్ గారితో యూఏఈ బేస్డ్ నిర్మాత ఒకాయన మహాభారతం తీస్తున్నారని. ఈ వార్త చూసి కొందరు మీ సినిమాను ఎవరో కాపీ కొట్టేస్తున్నారు, మీ ప్రాజెక్టును ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు..హైజాక్ చేస్తున్నారంటే నవ్వొచ్చింది. మహాభారతం కేవలం నాది కాదు... ప్రపంచంలో ఎవరైనా తీయొచ్చు. ఎలాగైనా తీయొచ్చు అని రాజమౌళి అన్నారు


తరిగేది కాదు

తరిగేది కాదు

మహాభారతం ఒకరు తీసినంత మాత్రాన ఇక అయిపోయింది రెండోసారి తీయలేమని కాదు. అదొక మహాసముద్రం. అందులో నుండి వాళ్లొక చెంబుడు నీళ్లు తీసుకుంటున్నారు. నేనొక చెంబుడు నీళ్లు తీసుకుంటున్నాను. ఇంకొక లక్ష మంది కోటి మంది కోటి చెంబుల నీళ్లు తీసుకోవచ్చు. అదేమీ తరిగేది కాదు అని రాజమౌళి అన్నారు.


మహాభారతం తీస్తాను కానీ...

మహాభారతం తీస్తాను కానీ...

ఎప్పటికైనా మహాభారతం తీస్తాను. ఇమ్మీడియేట్ గా చేయాలనే ఆలోచనైతే లేదు. ఈ లోగా ఎవరైనా తీస్తున్నారంటే సంతోషం. పది మంది పదిసార్లు తీసినా సరే నేను తీయడానికి అదేమీ అడ్డు కాదు. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ మాత్రం మహాభారతం కాదు అని రాజమౌళి అన్నారు. తర్వత సినిమా ఏమిటనేది ఇప్పటి వరకు ఏదీ డిసైడ్ కాలేదు. ఇంకా బాహుబలి నుండి బయట పడలేదు. తర్వాతి సినిమా విజువల్ ఎఫెక్ట్ లేని సినిమా ఎంచుకుంటానేమో అని రాజమౌళి అన్నారు.English summary
Responding to the question on Mohanlal’s ‘Mahabharatha’, Rajamouli explained how big the epic is and how a number of movies can be made from it. Each one would be different depending upon on what we choose to take from the epic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu