ఎన్టీఆర్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
ఎన్టీఆర్‌తో సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. అయితే తారక్‌తో సినిమా చేసేటప్పుడు అది తనకెలా ఉపయోగపడుతుందా? అని ఎదురు చూస్తాను. అలా చేసినదే 'యమదొంగ'. అలాగే మేం తదుపరి చేయబోయే చిత్రం కూడా తారక్ కెరీర్‌కి అది ఉపయోగపడేలా ఉండాలనేదే నా అభిప్రాయం'' అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. గతంలో ఎన్టీఆర్,రాజమౌళి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ వన్,యమదొంగ,సింహాద్రి చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చాలా మంది అభిమానులు రాజమౌళి,ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి అడుగుతున్నారు. ఊసరవెల్లి స్టేజిపై ఎన్టీఆర్ అదే విషయాన్ని రాజమౌళిని అడిగారు కూడా. ఇక దమ్ము ఆడియో పంక్షన్ లో ఈ విషయాన్ని స్పష్టం చేసారు రాజమౌళి.
అలాగే దమ్ము గురించి ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ''ఏడెనిమిదేళ్ల కిందటి వరకు నేను, వినాయక్ మాస్ సినిమాలు తీశాం. ఇప్పుడు ఆయన కామెడీ సినిమాలు తీస్తున్నారు. నేను 'ఈగ'లాంటి సినిమాలు తీస్తున్నాను. మాస్ సినిమాలు తీసే దర్శకులు తక్కువయ్యారనుకొనే సమయంలో బోయపాటి శ్రీను వచ్చాడు. 'దమ్ము' పాటలు అందరికంటే ముందే నేను విన్నాను. రూలర్ అనే పాటని పెద్దన్న కీరవాణి నాకు వినిపించారు. ఈ పాట నా సినిమాకొచ్చుంటే ఎంత బాగుండేదో అనిపించింది అన్నారు. ప్రస్తుతం రాజమౌళి ఈగి చిత్రం బిజీలో ఉన్నారు. ఆ చిత్రం అనంతరం ప్రభాస్ తో చేయబోయే చిత్రం ఉంటుంది.


Click it and Unblock the Notifications











