»   » పవన్, మహేష్, ఎన్టీఆర్, చరణ్...గురించి రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్

పవన్, మహేష్, ఎన్టీఆర్, చరణ్...గురించి రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ గురించి దర్శకుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రానా హెస్ట్ గా కొత్తగా ప్రారంభమైన 'నెం 1 యారి' కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు రాజమౌళి ఆసక్తికరంగా స్పందించారు.

సినిమా యాక్టింగ్‌ కాకుండా ప్రభాస్, రామ్ చరణ్, తారక్ వేరే వృత్తి తీసుకుంటే ఏం చేస్తారు? అని రానా అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ..... ప్రభాస్ చెఫ్‌గా బాగా సూటవుతాడని, రామ్ చరణ్ అయితే బిజినెస్ మ్యాన్ అవుతాడు.... తారక్ పాలిటిక్స్‌లోకి వెళ్లేవాడు అని రాజమౌళి తెలిపారు.

 Rajamouli about Pawan, Mahesh, NTR

పవన్‌, మహేష్‌బాబు పేర్లు చెబితే మీ మదిలో మెదిలే మూడు పదాలు ఏమిటి? అని రానా అడ్డగా, పవన్ అయితే...నిజాయతీ, విశ్వాసం, ఆరాధన గుర్తుకొస్తాయి. మహేష్‌ బాబు... అయితే హ్యాండ్సమ్‌.. హ్యాండ్సమ్‌.. హ్యాండ్సమ్‌ అంటూ కామెంట్స్ చేశాడు జక్కన్న.

తెలుగు సినిమాల్లో ఈ జనరేషన్‌లో మీ అభిమాన దర్శకుడు? ఎవరు అని అడగ్గా వెంటనే సుకుమార్ అని సమాధానం ఇచ్చాడు రాజమౌళి. 'బాహుబలి' సెట్స్‌లో ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి అనడిగితే.. రమ్యకృష్ణ అని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్‌, అనుష్క పేర్లను ఆప్షనల్‌గా ఇవ్వగా, రానా పేరు లేదా అని చమత్కరించారు రాజమౌళి.

English summary
Rana Daggubati's special talk show No. 1 Yaari and Rajamouli has revealed several interesting about Pawan, Mahesh, NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu