ఆది పురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడో చూశాను.. రాముడిగా ప్రభాస్ అదిరిపోయాడు.. రాజమౌలి కామెంట్స్ వైరల్
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోతున్నారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ప్రబాస్ హల్చల్ చేస్తుండటంతో అభిమానుల్లో సంతోషం రెట్టింపు అవుతోంది. బాలీవుడ్ ఖాన్‌లకు అందని అదృష్టం, క్రేజ్ ప్రభాస్‌కు దక్కుతున్నాయి. మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాడు. ఇక ఈ మధ్యే ప్రకటించిన ఆది పురుష్ సినిమాతో దేశాన్ని మరోసారి తన వైపు తిప్పుకోబోతోన్నాడు.

రాముడిగా ప్రభాస్..
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఓం రావత్.. ప్రభాస్‌ను ఆది పురుష్‌గా ప్రపంచానికి పరిచయం చేయబోతోన్నాడు. చెడుపై మంచి సాధించిన విజయమే ఆదిపురుష్ అంటూ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన తరువాత రాముడి పాత్రలో ప్రభాస్ నటించబోతోన్నాడని అందరికీ తెలిసిపోయింది. ఇక రాముడిగా ప్రభాస్ ఎలా ఉండోబోతోన్నాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సైతం దుమ్ములేచాయి.
Recommended Video

రాజమౌళి కామెంట్..
ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌గా చేసిన రాజమౌళి ఆది పురుష్‌పై కామెంట్ చేశాడు. రాముడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటాడన్న విషయంపై స్పందించాడు. ఈ మేరకు జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇక రాజమౌళి చెప్పిన మాటలు విన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ దర్శకధీరుడు ఏమన్నాడంటే..


Click it and Unblock the Notifications











