twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’...రాజమౌళి మధ్యలో డ్రాప్ అయితే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి'....రెండు పార్టులుగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు. ఇండియన్ సినిమా చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 250 కోట్ల బడ్జెట్. భారీ తారాగణం. వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు. భారీ సెట్టింగులు, వేలాది మంది కళాకారులు, సంవత్సరాల తరబడి ప్రొడక్షన్ వర్క్..... వీటన్నింటికీ మాస్టర్ మైండ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి.

    వందల కోట్ల ప్రాజెక్టును లీడ్ చేస్తున్న రాజమౌళి ఎప్పుడైనా మధ్యలో డ్రాప్ అవుదామనే ఆలోచనకు వచ్చాడా?.... ఇటీవల జాతీయ మీడియా ఇంటర్వ్యూలో రాజమౌళికి ఇలాంటి ప్రశ్న ఎదురైంది. దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ... ‘షూటింగ్ మొదలైన కొత్తలో కాస్త భయమేసింది. మూడు నాలుగు రోజులు కొనసాగించాలా? వద్దా? అని మదన పడ్డాను. అయితే వెంటనే ఆ ఫీలింగ్స్ నా మైండ్ నుండి కడిగేసాను. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు' అన్నారు.

    భారీ ప్రాజెక్టులను ప్లాన్ చేయడం, వాటిని తెరకెక్కించడంలో హాలీవుడ్ మనకంటే చాలా ముందంజలో ఉంది. మన కంటెంట్ ఉపయోగించి 80 శాతం హాలీవుడ్ క్వాలిటీతో, వారు ఖర్చుపెట్టే బడ్జెట్ లో 20 శాతం మాత్రమే ఉపయోగించి ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్లాన్ చేసాం అన్నారు రాజమౌళి.

     Rajamouli about quality of Baahubali

    బాహుబలి ఫస్ట్ పార్ట్ ఖర్చు రూ. 150 కోట్లు అయిందని.... సెకండ్ పార్టు పూర్తయే వరకు సినిమా మొత్తం బడ్జెట్ రూ. 250 కోట్లు అవుతుందని తెలిపారు. 2016లో బాహుబలి సెకండ్ పార్ట్ విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి వెల్లడించారు.

    ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే అతిపెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఇంత ఖర్చు ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టలేదు. ఇంత భారీ బడ్జెట్ చూసి భారతీయ సినీప్రియులు నోరెళ్ల బెడుతున్నారు. అయితే ఇంత బడ్జెట్ పెట్టిన నిర్మాతలు అంతకు రెట్టింపు రాబట్టుకునేందుకు పక్కా ప్లానింగుతో ముందుకు సాగుతున్నారు.

    బాహుబలి సినిమాకు సంబంధించి ఓ హాలీవుడ్ స్టూడియోతో రూ. 500 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రముఖ హాలీవుడ్ సినీ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో రూ. 500 డీల్ కుదిరినట్లు సమాచారం. మార్కెటింగ్ కూడా భారీ ఎత్తున చేస్తున్నారు.

    జులై 10న బాహుబలి మొదటి పార్టు తెలుగుతో పాటు తమిళం, హిందీలో విడుదలవుతోంది. ప్రపంచంలోని ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

    English summary
    “Just before the start of the Baahubali shoot, the sheer enormity of the logistics hit me. For about three to four days, I contemplated quitting. But the feeling washed over and I never looked back”, said Rajamouli
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X