'మగధీర' ఇప్పటికీ తీస్తూనే ఉండేవాళ్లం: రాజమౌళి
''చరణ్‌కి గాయం తగిలిందని అందరూ బాధపడుతున్నారు. దాని గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. ఇలాంటి గాయాల్ని లెక్కచేసుంటే 'మగధీర' సినిమాని ఇప్పటికీ తీస్తూనే ఉండేవాళ్లం. చిరంజీవి 'శంకర్‌దాదా ఎమ్.బి.బి.ఎస్'లో చేసిన డ్యాన్స్‌కంటే రెండింతలు ఎక్కువగానే చరణ్ చేసి చూపాడు'' అన్నారు రాజమౌళి. రచ్చ ఆడియో పంక్షన్ కి వచ్చిన రాజమౌళి ఈ విధంగా స్పందించారు.
హీరో రామ్‌చరణ్ 'రచ్చ'చిత్రం కోసం డాన్స్ చేస్తూ ప్రమాదానికి లోనయ్యారు. చిన్న గాయమే అనుకొని ప్రాథమిక చికిత్స అనంతరం చిత్రీకరణలో పాల్గొన్నారు. నొప్పి పెరగడంతో సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చరణ్‌కి పరీక్షలు నిర్వహించారు. తుంటి భాగంలోని కండరానికి గాయమైనట్లు వైద్యులు నిర్థరించారు. అయినా తన రచ్చ ఆడియో పంక్షన్ కి ఆయన హాజరయ్యారు. ఈ విషయం అక్కడ ప్రస్దావనకి వచ్చింది.
ఇదే విషయాన్ని చిరంజీవి సైతం ప్రస్దావిస్తూ.. చరణ్ 'మగధీర' షూటింగులో చాలాసార్లు గాయపడ్డాడు. చిన్న చిన్న సాకులు చూపుతూ పని ఎగ్గొట్టే రకం కాదు తను. నిర్మాతల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. నటుడికి అదే శ్రీరామరాక్ష. ఇదివరకు గోవాలో ట్రైన్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొన్నాడని నిర్మాతలు చెప్పారు. ఒక తండ్రిగా కంగారుపడ్డాను కానీ.. భయపడలేదు అన్నారు.


Click it and Unblock the Notifications











