RRRలో ఆ సీన్ గురించి ఎవరికి చెప్పలేదు.. చూస్తే గుండె వేగంగా కొట్టుకోవడం పక్కా: రాజమౌళి

దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాలలో RRR సినిమా టాప్ లిస్ట్ లో ఉంది అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగిన విషయం తెలిసిందే. ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు త్వరలోనే మరోసారి రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మళ్ళీ చేయబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

భారీగా ప్రమోషన్స్

భారీగా ప్రమోషన్స్

గతంలోనే ప్రమోషన్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసిన రాజమౌళి ఈసారి కూడా ఆ విషయంలో వెనుకడుగు వేయడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదని తెలుస్తోంది.
మెగా నందమూరి కలయికలో వచ్చిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా కావడంతో సినిమా కోసం కేవలం మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ చాలామంది ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

సరికొత్త సెన్సేషన్

సరికొత్త సెన్సేషన్

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ చేశాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా అన్ని క్లోజ్ అయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.

 ఈజీగా 1000కోట్లు..

ఈజీగా 1000కోట్లు..

ఇక సినిమాకు మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా చాలా ఈజీగా వంద కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు. అంతేకాకుండా 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా చాలా ఈజీగా 1000 కోట్ల వసూళ్లను కూడా సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

న్యూ రిలీజ్ డేట్..

న్యూ రిలీజ్ డేట్..


ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల అంశాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. కరోనా కారణంగా సినిమా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక మార్చి 25 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించగా ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Recommended Video

RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu
 సెకండ్ హాఫ్ లో పవర్ఫుల్ సీన్

సెకండ్ హాఫ్ లో పవర్ఫుల్ సీన్


ఇక గతంలో రాజమౌళి సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సన్నివేశం గురించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో రాజమౌళి ఏం చెప్పాడు అంటే.. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతంగా నటించారని సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా వారిని ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోతారు అంటూ గుండె చప్పుడు కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది అని అన్నారు. మరి రాజమౌళి చెప్పినట్లుగా వెండితెరపై ఆ సన్నివేశం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X