చెప్పుకోనంత మాత్రాన సాయం చేయనట్టు కాదు.. అలాంటి సినిమాలంటే నచ్చవు.. రాజమౌళి కామెంట్స్

టాలీవుడ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతోన్న జక్కన్న బాహుబలి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన రాజమౌళి అనేక విషయాలు పంచుకున్నాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

దాదాపు షూటింగ్ పూర్తి..

దాదాపు షూటింగ్ పూర్తి..

ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ రావడంతో అంతా తారుమారైంది. ఇప్పటికీ షూటింగ్ చకచకా జరుగుతూ ఉండేది. లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి కార్యకలాపాలు ఎక్కడే ఆగిపోయాయి. ఈ మధ్య రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, రామ్ చరణ్ టీజర్ ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొత్త ఐడియాల మీద వర్క్..

కొత్త ఐడియాల మీద వర్క్..


ఆర్ఆర్ఆర్ పనులతో పాటు కొత్త కథలపై వర్క్ చేస్తున్నానని తెలిపాడు. కాసేపటి క్రితమే తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబుతోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు మహేష్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి పోయారు.

అలాంటి సినిమాలు నచ్చవు..

అలాంటి సినిమాలు నచ్చవు..


ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండగా వీటి నేపథ్యంలో సినిమాలు కూడా తెరకెక్కించేవారుంటారు. హాలీవుడ్‌లో ఈ తరహా సినిమాలు వస్తూనే ఉంటాయని అయితే తనకు మాత్రం అలాంటివి నచ్చవని చెప్పుకొచ్చాడు.

Recommended Video

RRR Movie Release May Postpone Again Because Of Chiranjeevi
చెప్పుకోనంత మాత్రానా..

చెప్పుకోనంత మాత్రానా..


మా కుటుంబం, స్నేహితుల బృందం ఏదో ఒకటి వచ్చినప్పుడే కాదు.. ఏడాది పొడవునా ఏదో సాయం చేస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే కొంతమంది మాత్రం చెప్పుకోవడానికి ఇష్టపడతారు.. కొందరు ఇష్టపడరని తెలిపాడు. చెప్పుకోవడం తప్పేం కాదని, చెప్పుకోనంత మాత్రాన చేయనట్టు కాదని తెలిపాడు. తాజాగా సీసీసీకి తక్కువ మొత్తంలో సాయం చేయడంపై ఈ విధంగా స్పందించినట్టున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X