»   » తమన్నాను హాట్ అండ్ సెక్సీగా చూపడంపై రాజమౌళి వివరణ

తమన్నాను హాట్ అండ్ సెక్సీగా చూపడంపై రాజమౌళి వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాలో హీరోయిన్ తమన్నాను ఓ వైపు రెబల్ క్యారెక్టర్‌లో పోరాట యోధురాలిగా రఫ్‌గా చూపిస్తూనే..... మరో వైపు ఆమెను రొమాంటిక్ సీన్లలో హాట్ అండ్ సెక్సీగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు రాజమౌళి. పచ్చ బొట్టేసిన సాంగులో తమన్నా, ప్రభాస్ మధ్య శృంగార సన్నివేశాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే లాజికల్‌గా తిరుగుబాటు పోరాట యోధురాలిని శృంగార పరమైన సీన్లలో చూపించడంపై విమర్శలు వచ్చాయి.

ఇటీవల ఓ ఇంటర్య్యూలో రాజమౌళి ఈ విషయమై స్పందిస్తూ... తాను ఏదైనా సీన్ రాసే సమయంలో లాజిక్ గురించి ఆలోచించను, అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా? లేదా? అనే అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాను. అవంతిక క్యారెక్టర్ రెబల్ అయినప్పటికీ.... ఆమె మహిళ అనే విషయాన్ని శివుడు గుర్తు చేస్తాడు అని రాజమౌళి చెప్పుకొచ్చారు.మరో వైపు....ప్రభాస్, తమన్నా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లపై మహిళా జర్నలిస్టు అన్నా వెట్టికాడ్ రాసిన వ్యాసం ఇపుడు చర్చనీయాంశం అయింది. ‘ది రేప్ ఆఫ్ అవంతిక' పేరుతో ప్రముఖ ఆంగ్లపత్రికలో రాసిన ఆ వ్యాసంలో ఆమె దర్శకుడు ఆ సీన్‌ను మలిచిన తీరును తప్పుబట్టారు. అవంతిక అనుమతి లేకుండా దొంగచాటుగా పచ్చబొట్టు వేయడం, అవంతిక అనుమ‌తి లేకుండా ఆమె జుట్టు ముడివిప్పి... ఆమె వ‌స్ర్తాలు తొల‌గించి...అడవిలో దొరికే సహజ రంగులతో ఆమెకు లిప్ స్టిక్ అద్దడం, కాటుక పెట్టడంపై విమర్శలు గుప్పించారు.


Rajamouli about Tamanna's hot scenes

శివుడి పాత్ర అవంతిక పాత్ర పూర్తిగా తప్పుగా ప్రవర్తించింది. బాహుబలి లాంటి అద్భుతమైన విజువల్స్, పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాలో ఓ అపరిచితుడు, ఓ అమ్మాయిని ఇలా చేసి...ఆమెను ముగ్గులో దించి ప్రేమ‌లో ప‌డేయ‌డం చూస్తే యువ‌త‌కు ఎలాంటి సందేశం ఇచ్చిన‌ట్ల‌వుతుద‌ని ఆమె త‌న వ్యాసంలో ప్ర‌శ్నించారు.

English summary
Rajamouli speaking to a popular North Indian media answered many questions regarding ‘Baahubali’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu