రజనీ, కమల్ లను కలిపితే ఆ హీరో:రాజమౌళి
"రజనీకాంత్, కమల్‌హాసన్‌లను కలిపితే సూర్య అవుతారు. సెవెన్త్ సెన్స్ సినిమా కోసం మేం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మురుగదాస్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన తీసే సినిమాలు వెరైటీగా ఉంటాయి. వాటిలోనే కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీస్తారు. మంచి కథలో పాటల్ని, ఫైట్లను అందంగా కలిపే దర్శకుడు మురుగదాస్. 'సెవెన్త్ సెన్స్" అంటే ఏంటో చూడాలని ఎక్జయిటింగ్‌గా ఉంది. అని రాజమౌళి అన్నారు. మురుగదాస్, సూర్య కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'సెవెన్త్ సెన్స్'. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని రామ్‌చరణ్ విడుదల చేసి హీరో కార్తికి అందజేశారు. 'నేను 'ఠాగూర్" సినిమా చేశానంటే దానికి కారణం మురుగదాస్. ఆయనంటే నాకెంతో గౌరవం. లోగో నుంచి ఈ చిత్రం అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా ఉంది"" అని వీవీ వినాయక్ అన్నారు. సూర్య, శృతిహాసన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ఏళామ్ అరివు"ని తెలుగులో 'సెవెన్త్ సెన్స్" పేరిట లక్ష్మీగణపతి ఫిలింస్ సుబ్రహ్మణ్యం విడుదల చేస్తున్నారు. ఈ ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ఎస్.ఎస్. రాజమౌళి, వీవీ వినాయక్ పై విధంగా స్పందించారు. చిత్రసంగీత దర్శకుడు హారీస్ జైరాజ్ మాట్లాడుతూ - 'ఇది చాలా ప్రెస్టీజియస్ సినిమా. 'గజిని" రికార్డులను బ్రేక్ చేస్తుంది"" అన్నారు. సూర్య మాట్లాడుతూ - ''గజినికన్నా ఐదారు రెట్లు ఈ చిత్రం బాగుంటుంది"" అన్నారు. ''ఈ సినిమా కోసం అన్నయ్య ఏడాది కష్టపడ్డాడు. ఇంత కష్టం అవసరమా? అంటే ప్రేక్షకుల కోసం తప్పదన్నాడు"" అన్నారు. ఒక మంచి ప్రయత్నం చేశామని మురుగదాస్ చెప్పారు. ఇంకా ఈ వేడుకలో అల్లు అరవింద్, 'ఠాగూర్" మధు, ఎన్వీ ప్రసాద్, అంబికా కృష్ణ, శర్వానంద్, శృతిహాసన్, సుబ్రమణ్యం, భువనచంద్ర, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీని రామ్‌చరణ్ ఆవిష్కరించి కార్తీకి ఇచ్చారు.


Click it and Unblock the Notifications











