కేసీఆర్ కూతురు కవిత ఛాలెంజ్ స్వీకరించిన డైరెక్టర్ రాజమౌళి!
Recommended Video

మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఫిట్‌నెస్ ఛాలెంజ్ ట్రెండ్ అయింది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరిస్తూ వ్యాయామాలు చేస్తూ వీడియోలు, ఫోటోలు పోస్టు చేశారు. ఇదే తరహాలో ఇపుడు గ్రీన్ ఛాలెంజ్ అనేది కొత్తగా ట్రెండింగులోకి వచ్చింది. మన పరిసరాలను పచ్చగా మార్చడం, మొక్కలు నాటడం అనేది ఈ గ్రీన్ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో రాజమౌళిని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత ఛాలెంజ్ చేయడంతో ఆయన దాన్ని స్వీకరించారు.
రాజమౌళి తన పొలం వద్ద ఇలా..
కవిత ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి తన వ్యవసాయ క్ష్రేత్రం వద్ద బన్యాన్, గుల్ మొహర్, నీమ్ చెట్లను నాటారు. అంతే కాకుండా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, తెలంగాణ మంత్రి కేటీఆర్, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తదితరులను ఛాలెంజ్ చేశారు.
థాంక్యూ అంటూ కవిత రిప్లై
తన ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళికి థాంక్స్ చెబుతూ కవిత ట్వీట్ చేశారు.
ఎంపీ కవిత
రాజమౌళికి ఛాలెంజ్ విసిరే ముందు కవిత.... ప్రియాంక నుండి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించారు.

ఇది వైరల్ అయితే అంతా పచ్చదనమే
గ్రీన్ ఛాలెంజ్ వైరల్ అయ్యి సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటినా తెలుగు రాష్ట్రాల్లో పచ్చదనం ఓ రేంజిలో పరిమిళించడం ఖాయం. మరి రాజమౌళి బాటలో ఎంత మంది నడుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











