Don't Miss!
- News మాజీ సీఎం రిలీఫ్, హైకోర్టు ఆదేశాలు, మహిళలనపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజమౌళి వల్లే... అంటూ అందాల రాక్షసి కామెంట్
హైదరాబాద్: లావణ్య త్రిపాఠి... పేరు ఎంత మందికి గుర్తుందో తెలియదు కానీ, అందాల రాక్షసి హీరోయిన్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులందరూ వెంటనే గుర్తు పడతారు. తన క్యూడ్ అండ్ బబ్లీ లుక్‌తో 'అందాల రాక్షసి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయిన లావణ్య త్రిపాఠి తనకు ఇంత పేరు రావడానికి దర్శకుడు రాజమౌళి కారణం అంటోంది.
ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'అందాల రాక్షసి' సినిమాకు రాజమౌళి వల్లే అంత గుర్తింపు వచ్చింది. లేకుంటే ప్రేక్షకులు సినిమాకు అంతలా రీచ్ అయ్యే వారు కాదు. ప్రక్షకులు వచ్చి చూస్తేనే కదా దర్శకుడు, నటీనటులు పనితనం ఎలా ఉందనేది బయట పడేది. రాజమౌళి నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం వల్లనే ఆ సినిమాకు క్రేజ్ పెరిగింది' అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న టైటిల్ ఖరారు కాని సినిమాలో నటిస్తోంది. లావణ్య త్రిపాఠికి సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన లావణ్య 2006లో మిస్ ఉత్తరఖండ్ కిరీటం దక్కించుకుంది.
2012లో అందాల రాక్షసి తెలుగు చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అందాల రాక్షసి చిత్రంలో లావణ్య పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.
అందాల రాక్షసి సినిమాకు రాజమౌళి వల్లే ఎక్కువ పేరొచ్చిందని చెబుతోంది లావణ్య.
ప్రస్తుతం లావణ్య మంచు విష్ణు సినిమాలో నటస్తోంది.
అందాల రాక్షసి సినిమాలో అంతా కొత్త వారే, కానీ మంచు విష్ణు సినిమాకు వచ్చేసరికి నాపై ఒత్తిడి పెరిగింది అంటోంది.
అందాల రాక్షసి తర్వాత లావణ్య ఆచితూచి సినిమాలకు సైన్ చేస్తోంది.
చాలా అవకాశాలు వస్తున్నా.... సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది.
ఇటీవలే ఆమె మరో తమిళ సినిమాకు సైన్ చేసినట్లు చెప్పింది.
మంచు విష్ణుతో చేసే సినిమాకు తన కెరీర్ కు బాగా ప్లస్సవుతుందనే నమ్మకంతో ఉంది.