'పులి' గురించి కామిడీగా అన్నా అంతే: ఎస్.ఎస్ రాజమౌళి
నేను పులిని పోస్ట్ ఫోన్ చెయ్యమంటే చేస్తారా...నేనోదో కామిడీగా చేసిన ట్వీట్ ని మీడియా న్యూస్ ఐటం చేసింది. నేను అరవింద్ గారిని అడిగానని ఒకడు పవన్ కళ్యాణ్ ని అడిగానని ఒకడు వాళ్ళకిష్టమొచ్చినట్లు రాసుకున్నారు. ఎవరు ఎవరి కోసమూ సినిమాలు ఆపరు బాస్. డోంట్ వర్రీ అంటూ రెండు రోజుల క్రింతం పులి గారు కొంచెం లేటుగా రండి అని మర్యాదగా అడుగుదాము" అంటూ ట్వీట్ చేసిన రాజమౌళి ఖండిస్తూ రీసెంట్ గా ట్వీట్ చేసారు. అలాగే...పులి వచ్చే లోపు మర్యాదరామన్న బయ్యర్స్ కి వాళ్ళ ఇన్వెస్ట్ మెంట్ వచ్చేస్తే చాలు...అన్నారు అప్పుడే మరొకరికి ట్వీట్ చేస్తూ రాజమౌళి. వాటినే ఉన్నది ఉన్నట్లుగా మీడియా ప్రెసెంట్ చేసింది. ఇప్పుఢేమో ఆయన మీడియా తన ఇష్ఠం వచ్చినట్లు ప్రెసెంట్ చేసిందని వాపోతున్నారు.
ఇక రాజమౌళి మర్యాదరామన్న చిత్రం ఆడియో మొన్న రిలీజ్ అయింది. సునీల్, సలోని కాంబినేషన్లో రెడీ అయిన ఈ చిత్రం జూలై 16న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక 'మర్యాద రామన్న' చిత్రం ఓ కామిడీ ఫిల్మ్, అలాగని అదేమీ స్లాఫ్ స్టిక్ కామిడీ కాదు. అలాగే నా తరహా రెగ్యులర్ చిత్రం కాదు. చూద్దాం ఈ ఎక్సపెరిమెంట్ ఎలా వర్కవుట్ అవుతుందో అంటున్నారు రాజమౌళి. ఇందులో బ్రహ్మనందం, నాగినీడు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











