రాజమౌళి 'విశ్వామిత్ర'
'మగధీర', 'యమదొంగ' లాంటి సోషియోఫ్యాంటసీ చిత్రాలను సృష్టించిన 'జక్కన్న' రాజమౌళి త్వరలోనే మరో చారిత్రాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం హాస్యనటుడు సునీల్ కథానాయకుడిగా 'మర్యాద రామన్న' చిత్రాన్ని తీస్తున్న జక్కన్న, దీని తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు సమాచారం. ఇందులో విశ్వామిత్రగా 'యంగ్ రెబల్ స్టార్' ప్రభాస్ నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని రాజమౌళి గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించనున్నారని సమాచారం.
ఇంతకు ముందు రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన 'ఛత్రపతి' ఘనవిజయాన్ని సాధించి, ప్రభాస్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. చాన్నాళ్లుగా ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కు ఈ చిత్రం తిరిగి పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా తనకో కొత్త ఇమేజ్ ను తీసుకొస్తుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











