»   » అద్గదీ రాజమౌళి అంటే..: బన్నీ పట్టించుకోకున్నా విష్ చేసిన దర్శక ధీరుడు!

అద్గదీ రాజమౌళి అంటే..: బన్నీ పట్టించుకోకున్నా విష్ చేసిన దర్శక ధీరుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది పెద్దల మాట. రాజమౌళికి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం ఆయన తెలుగు సినీ పరిశ్రమను స్థాయిని ఎప్పుడో దాటేసి ఇండియన్ సినీ పరిశ్రమ స్థాయికి ఎదిగారు. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన స్థాయి మారినా ఆయన వ్యక్తిత్వం, ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చే విధానం మారలేదు. కింది స్థాయి ఇంత హై రేంజికి ఎదిగిన రాజమౌళి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఫాలో అవుతూ అభిమానుల దృష్టిలో హీరో అయ్యాడు.

తెలుగు సినిమా దర్శకుడు క్రిష్ వివాహం హైదరాబాద్ లో జరిగి సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇపుడు హాట్ టాపిక్ అయింది.

ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. బన్నీ వివాహ వేడుక ప్రాంగణంలోకి హాజరు కాగానే... రాజమౌళి ఎదురు పడ్డారు. అయితే బన్నీ చుట్టూ బాడీగార్డ్స్ ఉండటం వల్లన రాజమౌళి బన్నీకి కనిపించలేదా? కనిపించినా కనిపించనట్లు(వీడియో చూస్తే ఇలానే అనిపిస్తుంది) బన్నీ ప్రవర్తించాడో తెలియదు కానీ....బన్నీ తొలత విష్ చేయలేదు. బన్నీని గమనించిన రాజమౌళి ఆయన చుట్టూ ఉన్న బాడీగార్డ్స్‌ అడ్డు తొలగించుకుని వచ్చి మరీ బన్నిని విష్ చేసాడు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వీడియో ఉంది. మీరూ ఓ లుక్కేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో తెలియజేయండి.

బన్నీ

బన్నీ

క్రిష్ వివాహ వేడుకకు హాజరవుతున్న బన్నీ....

రాజమౌళి

రాజమౌళి

దర్శకుడు క్రిష్ వివాహ వేడుకకు హాజరవుతున్న రాజమౌళి.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ప్రముఖులను పలకరిస్తూ అల్లు అర్జున్..

రాజమౌళి, బన్నీ వీడియో..

క్రిష్ వివాహ వేడుకలో రాజమౌళి, బన్నీకి సంబంధించిన ఆసక్తికర వీడియో...

English summary
Check out video of Rajamouli‬ and Allu Arjun at director Krish Marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu