ప్రయోగాల దర్శకధీరుడు రాజమౌళి ‘ఈగ’ లేటెస్ట్ ఇన్ఫర్ మేషన్...
వరుస విజయాల దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించనున్న తాజా చిత్రం 'ఈగ". తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని అపూర్వ ప్రయోగంలా, అత్యద్భుత సాంకేతిక మాయాజాలంలా ఈ 'ఈగ" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. 'అష్టాచమ్మా,రైడ్" వంటి సక్సెస్ లు సాధించి రీసెంట్ గా 'అలా మొదలైంది" తో మరో సూపర్ హిట్ కొట్టిన నాని, 'ఏమాయ చేశావె, బృందావనం"చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగిన సమంత 'ఈగ" చిత్రంలో హీరో, హీరోయిన్స్ గా నటించనున్నారు. కన్నడ సినీ రంగంలో ప్రముఖ హీరో సుదీప్ 'ఈగ"లో ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం.
ఫిబ్రవరి 21నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇటీవలే పలువురు సినీ రంగ ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభమైన 'ఈగ" రెగ్యులర్ షూటింగ్ ఈనెల 21నుంచీ హైదరాబాద్ లో జరుగనుంది. రాజమౌళి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ప్రతిష్టాత్మకమైన రీతిలో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రానికి బిజినెస్ వైజ్ భారీ క్రేజ్ ఏర్పడింది. భయ్యర్స్ మద్య కాంపిటీషన్ క్రియేట్ అయింది. అలాగే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పటినుంచి తమిళ రైట్స్ కోసం కూడా పలువురు పోటీ పడగా కోలీవుడ్ లో ఇప్పటివరకూ మరే తెలుగు సినిమాకీ ఇవ్వనటువంటి హయ్యస్ట్ ఎమౌంట్ ని ఆఫర్ చేసి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఈగ" రైట్స్ ని దక్కించుకుంది.
ఇక 'ఈగ" కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియెన్స్ వర్క్ చేస్తుండడం, అందరిలోనూ ఆసక్తిన రేకెత్తించి 'ఈగ"పై అంచనాలను పెంచుతోంది. వారాహి చలనచిత్రం పతాకంపై తెరకెక్కనున్న ఈ ప్రెస్టీజియెస్ ప్రాజెక్ట్ కి సంగీతం: ఎం ఎం కీరవాణి, స్టైలింగ్: రమా రాజమైళి, సినిమాటోగ్రఫీ: జేమ్స్ ప్లోడ్స్, ఆర్ట్: ఎస్.రవీందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, స్టిల్స్:శ్రీను, కాస్ట్యూమ్స్: కృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: డి యోగానంద్, సమర్ఫణ: డి సురేష్ బాబు, నిర్మాత: కొర్రపాటి సాయి, కథ, స్ర్కీన్ ప్లే దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి.


Click it and Unblock the Notifications











