సినీ ప్రియులకు ఊహించని ట్రీట్: బాలకృష్ణతో రాజమౌళి.. స్టార్ ప్రొడ్యూసర్ అదిరిపోయే ప్లాన్
బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తన టాలెంట్లను చూపించి.. దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో పలు రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆరు పదుల వయసులోనూ ఎంతో ఎనర్జీతో కనిపించడమే కాదు.. ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాలు చేస్తున్నారు. అదే సమయంలో ఇటీవలే బాలయ్య.. ఆహా సంస్థ కోసం 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే షోతో హోస్టుగా పరిచయం అయ్యారు. తాజాగా ఈ షో నుంచి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ'తో హిట్ కొట్టేసిన బాలయ్య
టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రమే 'అఖండ'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో హోస్ట్
ఆరు పదుల వయసులోనూ ఉత్సాహంగా కనిపించే నందమూరి బాలకృష్ణ.. అరవై ఏళ్ల ఏజ్‌లోనూ ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి వచ్చారు. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ టాక్ షోను గ్రాండ్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే.

రెండు ఎపిసోడ్స్ సూపర్ హిట్ అవగా
బాలయ్య 'Unstoppable with NBK' టాక్ షో రెండు ఎపిసోడ్లను త్వరత్వరగా పూర్తి చేసుకుంది. మొదటి దానికి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు గెస్టులుగా వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ఈ రెండింటికీ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ టాక్ షోకు చాలా క్లిక్కులు దక్కడంతో సూపర్ హిట్ అయింది.

మూడు, నాలుగు ఎపిసోడ్స్ కూడా హిట్
ఆహాలో 'Unstoppable with NBK' టాక్ షోను ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేశారు. కానీ, బాలయ్యకు సర్జరీ జరగడంతో గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలోనే చిన్న విరామం తర్వాత బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో మూడో ఎపిసోడ్‌ను స్ట్రీమ్ చేసేశారు. ఆ తర్వాత అంటే గత వారమే బోయపాటి శ్రీను, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, థమన్‌లతో కలిసి మరొకటి చేశారు.

ఆ సెలెబ్రిటీలను తీసుకొచ్చేందుకు
నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షో సూపర్ డూపర్ హిట్ అవడంతో.. నిర్వహకులు మరిన్ని ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే మరికొంత మంది సెలెబ్రిటీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, స్టార్ హీరోలను కూడా ఇందులో భాగం చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణతో దర్శకుడు రాజమౌళి జోడీ
'Unstoppable with NBK' షోలో భాగంగా ఈ వారం ప్రసారం కానున్న ఐదో ఎపిసోడ్ కోసం దర్శకధీరుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి గెస్టులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు కొద్ది సేపటి క్రితమే బయటకు వచ్చాయి. RRR మూవీ ప్రమోషన్‌లో భాగంగానే.. అల్లు అరవింద్ కోరిక మేరకు వీళ్లిద్దరూ షోలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











