అమ్మో ఇది మామూలు ప్లానింగ్ కాదు.. నితిన్ కోసం రంగంలోకి రాజమౌళి
నితిన్ సినిమా అంటే సినీ వర్గాల్లో, సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలుంటాయి. మరీ ముఖ్యంగా నితిన్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ తమ సొంత సినిమాలా భావిస్తారు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని, భక్తుడిగా చెప్పుకునే నితిన్ సినిమాలను ఆయన అభిమానులు భుజాన మోస్తుంటారు. అలాంటి నితిన్ చెక్ సినిమాతో వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ జోరు పెంచేశాడు.

‘చెక్’పై అంచనాలు..
చెక్ సినిమాను చంద్రశేఖర్ యేలేటి ఆద్యంతం సీటు అంచున కూర్చోబెట్టేలా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. టీజర్, ఫస్ట్ లుక్, పోస్టర్లతోనే ఆ విషయం అర్థమవుతోంది. ఇంటెలిజెంట్ అయిన హీరో జైల్లో ఎందుకు ఉన్నాడు.. చదరంగం ఆడటంతో అతని నైపుణ్యం ఇలా ఎన్నెన్నో ఆసక్తికర అంశాలతో తెరకెక్కించాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్..
చెక్ సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేయబోతోన్నారు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌నుప్లాన్ చేశారు. అయితే ఫిబ్రవరి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ప్రకటించారు. కానీ అసలు ట్విస్ట్‌ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

ముఖ్య అతిథులుగా..
చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోతోన్నారనే సమాచారం బయటకు వచ్చింది. చెక్ ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్ భల్లే ప్లాన్ వేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మెగా ఫ్యాన్స్ అలా..
మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు వరుణ్ తేజ్‌ను ముఖ్య అతిథిగా తీసుకురానున్నాడు నితిన్. ఎలాగూ మెగా ఫ్యామిలీకి నితిన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. పిలవగానే వరుణ్ తేజ్ అలా ఒప్పేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే దర్శకధీరుడిని పిలవడంతో అందరూ షాక్ అవుతున్నారట.

అంత బిజీగా ఉన్నా..
ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళి నితిన్ కోసం ఈవెంట్‌కు రాబోతోన్నాడట. అసలే సై సినిమా నాటి బంధంతో రాజమౌళి నితిన్ కోసం కదిలి వస్తున్నాడట. రాజమౌళి వస్తే కచ్చితంగా మీడియా మొత్తం అటు వైపే తిరుగుతుంది. రగ్బీ ఆటతో రాజమౌళి నితిన్‌తో సినిమా తీస్తే.. ఇప్పుడు చదరంగం నేపథ్యంలో చంద్రశేఖర్ యేలేటి చెక్ సినిమాను తెరకెక్కించాడు.


Click it and Unblock the Notifications











