twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రధానమైన నాలుగు లుక్ లు, తేదీ లు ప్రకటించిన రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాహుబలి సినిమా విడుదల ఆలస్యం అయిందని గ్రహించిన రాజమౌళి మే 1 నుండి ఒక్కొక్క పోస్టర్ విడుదల చేసి ప్రేక్షకులకు చేరువవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు విడుదల చేసిన అన్ని పాత్రల ఫస్ట్ లుక్ కి విపరీత స్పందనే లభించింది. అయితే అసలు బాహుబలి అయిన రానా, ప్రభాస్ (బాహుబలి)లుక్ మాత్రం వదలలేదు. ఇదే ప్రశ్నను రాజమౌళిని అడిగితే నీకూ ముహూర్తం ఖరారు చేశానని చెప్పేసి ప్రకటించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    భల్లాలదేవ గా రానాని ఈ నెల 20న చూపించనున్నారు. ప్రభాస్ ని శివుడుగా ఇప్పటికే చూపించిగా బాహుబలిగా 22న పరిచయం చేయనున్నారు రాజమౌళి. అలాగే...మే 18 న తమన్నాని అవంతిక గా చూపిస్తారు. ఇక మే 31 న ఆడియోని, ట్రైలర్ ని విడుదల చేసి పండుగ చేయనున్నారు. ఈ రోజుల కోసం రాజమౌళి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    ‘బాహుబలి' చిత్రం భారీ బడ్జెట్‌తో ఈ వేసవిలో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో విడుదలకు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా ఈ ఆడియో నిమిత్తం కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టాలని నిర్మాతలు ప్రిపేర్ అయ్యారని చెప్పుకుంటున్నారు.

    ఎందుకంటే ఈ ఆడియో హక్కులు కోసం...పెద్ద పెద్ద ఆడియో కంపెనీలు చాలా ఖర్చు పెట్టి సొంతం చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయని సమాచారం. అలాగే ఈ ఆడియోకు తమిళం నుంచి రజనీకాంత్, హిందీ నుంచి అక్షయకుమార్, తెలుగు నుంచి రాజమౌళి ఇప్పటిదాకా చేసిన హీరోలు హాజరు కానున్నారని సమాచారం.

    Rajamouli announces next 4 big dates

    ఈ నేఫద్యంలో రాజమౌళి ప్రమోషన్ పనులును వేగవంతం చేసి రోజుకో రెండు రోజులకో పోస్టర్ చొప్పిన వదిలి సినిమాపై క్రేజ్ ని పెంచుతున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతోఅయితే ఈ విషయమై నిర్మాతలు తేదీ ఖరారు చేస్తూ ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.

    మరో ప్రక్క పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి.

    ప్రభాస్‌తో ‘మిర్చి', శర్వానంద్‌తో ‘రన్‌ రాజా రన్‌' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్‌ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ వెర్షన్‌ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్‌ సమాచారం.

    ‘బాహుబలి' చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. వంద సెకండ్ల నిడివిగల ట్రైలర్‌ను చూపించే విధంగా ఎడిట్‌ చేస్తున్నారని ఫిలింనగర్‌ సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి చిత్రం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్రం విడుదల ఆలస్యం అవుతూండటంతో రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజవౌళి వినూత్న ప్రచారానికి తెరదీశారు.

    English summary
    Rajamouli says that there are only 3 more looks pending to be released, while audio launch and trailer launch are the big things. On May 18th, 20th and 22nd, looks of Avantika (Tamanna), Ballaladeva (Rana) and Bahubali (Prabhas) will be unveiled while on May 31st audio and trailer will be launched.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X