అది అంతర్జాతీయ స్థాయి.. రాజమౌళి చాటింగ్‌ను బయటపెట్టేసిన దర్శకుడు
మళయాలం సినిమాలెప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎప్పుడూ కూడా హంగూ ఆర్భాటాలకు వెళ్లదు. భారీ బడ్జెట్ చిత్రాలంటూ చేతులు కాల్చుకోలేదు. సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను నిర్మిస్తూ మాలీవుడ్ తన సత్తాను చాటుతుంది. ప్రతీ సారి జాతీయ అవార్డుల్లో మాలీవుడ్ తన ముద్రను వేస్తూనే ఉంటుంది. అలాంటి మాలీవుడ్‌లో ప్రస్తుతం జీతూ జోసెఫ్ మ్యాజిక్స్ క్రియేట్ చేస్తున్నాడు.
తెల్లచీరలో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ (ఫొటోలు)

దృశ్యం సినిమాలతో..
దృశ్యం సినిమాతో జీతూ జోసెఫ్ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు ఇండియాలోని అన్ని భాషల్లో ఈ మూవీ రీమేక్ అయింది. చైనాలోనూ ఈ మూవీని రీమేక్ చేశారు. ఇక పార్ట్ 2గా వచ్చిన దృశ్యం 2 మూవీ కూడా సూపర్ హిట్ అయింది.

ఓటీటీలో రచ్చ..
దృశ్యం 2 సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన మూవీగా దృశ్యం 2 నిలిచింది. ఈ మూవీకి వచ్చిన టాక్‌ను చూసి ఇప్పటికే అందరూ రీమేక్ హక్కులు కొనేశారు. ఆల్రెడీ తెలుగులో పార్ట్2 లాంఛనంగా ప్రారంభమైంది.

రాజమౌళి ప్రశంసలు..
అయితే జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభను రాజమౌళి ప్రశంసించాడు. తాజాగా జీతూ జోసెఫ్‌కు రాజమౌళి పర్సనల్‌గా మెసెజ్ పెట్టాడు. ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే..

అంతర్జాతీయ స్థాయి..
హాయ్ జీతూ.. నేను రాజమౌళి.. సినిమా దర్శకుడిని. మొన్నీమధ్యే దృశ్యం 2 సినిమా చూశాను.. వెంటనే మళ్లీ మొదటి పార్ట్‌ను మళయాలీ వర్షెన్‌లో చూసేశాను. ఎందుకంటే నేను తెలుగు దృశ్యం మాత్రమే చూశాను. డైరెక్షన్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆ కథ, కథనం మాత్రం వేరే లెవెల్. అది అంతర్జాతీయ స్థాయిలో ఉంది.

ఇలాంటి మాస్టర్ పీస్‌లు
మొదటి భాగమే ఓ మాస్టర్ పీస్. ఇక రెండో పార్ట్ కోసం మీరు రాసిన కథ, కలిపిన విధానం, మొదటి పార్ట్‌లానే ఎంతో గ్రిప్పింగ్‌గా మలిచిన తీరు అద్భుతం. ఇంకా మీ నుంచి ఇలాంటి మాస్టర్ పీస్‌లు రావాలని ఆశిస్తున్నాను అంటూ ఓ సుధీర్ఘమైన మెసెజ్ చేశాడు రాజమౌళి.


Click it and Unblock the Notifications











