రాజమౌళి చైల్డ్ హీరోగా చేసిన సినిమా 'పిల్లన గ్రోవి'

By Srikanya

మగధీర వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళి చిన్న వయస్సులో హీరోగా(ప్రధానపాత్రగా) పిల్లనగ్రోవి అనే చిత్రంలో చేసారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్టు ఓ ప్రముఖ దినపత్రికలో రాసుకొచ్చారు. ఈ చిత్రం పాతికేళ్ల క్రితం తయరైంది. అయితే రిలీజుకు నోచుకోలేదు.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఆయన సోదరుడు రచయిత శివశక్తి దత్తా డైరక్టర్. కథ మొత్తం ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో చిన్న పిల్లల చుట్టూ తిరుగుతూ ఈ కథ సాగుతుంది. ఇందులో చిన్నపిల్ల పాత్రకు తన తమ్ముడు కూతరు శ్రీలేఖని(సంగీత దర్శకురాలు)ఎంపికచేసారు శివశక్తి దత్తా. అలాగే కథకు ప్రాణమైన బాలకృష్ణుడి పాత్రకు బొద్దుగా ఉండే రాజమౌళి ని తీసుకున్నారు. మిగతా పాత్రల్లో జె.వి.సోమయాజులు, మిక్కిలినేని, నిర్మలమ్మ తదితరులను కనిపిస్తారు. ఆ షూటింగ్‌ అంతా పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, పరిసర ప్రాంతాల్లో చేశారు. అయితే డబ్బు ఇబ్బందులతో ఆ చిత్రం ఆగిపోయింది. డబ్బు వచ్చాక ఆ సినిమాను పూర్తి చేద్దామని అనిపించింది. అయితే అప్పటికే శ్రీలేఖ, రాజమౌళి పెద్దవాళ్ళయిపోయారు. దాంతో సినిమా ఆగిపోయింది. ఇక మరో ట్విస్ట్ ఏమిటంటే..ఈ పిల్లనగ్రోవికి కీరవాణి స్వరాలందించారు. అలా రాజమౌళి చిన్నప్పుడే తెరపై కనపించారన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X