కొండవీటి సింహంగా రాజమౌళి, అరబ్బు షేక్‌గా రాఘవేంద్రరావు
2011లో కూడా 1970 గెటప్పుల్లో కనిపిస్తున్నారు.. వీళ్లెవరబ్బా..? అనుకొంటున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఇద్దరూ గురుశిష్యులని శీర్షికలోనే ఓ క్లూ కూడా ఇచ్చేశాం! ఆదివారం పూట ఈ పజిలేంటి అనుకొంటే సమాధానం మేమే చెప్పేస్తాం. వీళ్లెవరో కాదు... రాజమౌళి - రాఘవేంద్రరావు. ఆ మధ్య రాజమౌళి సన్నిహితులు కొద్దిమంది సరదాగా హైదరాబాద్‌లో ఓ పార్టీ చేసుకున్నారు. ఎక్కువ మంది కాదులెండి... ముప్ఫైమంది మాత్రమే! ఈ పార్టీకో లెక్క ఉంది.
70, 80 దశకాల్లో వచ్చిన సినిమా కాస్ట్యూమ్స్, గెటప్పుల్లో పాల్గొనాలి. ఆ షరతు ప్రకారం ముప్ఫైమందీ ఒక్కో గెటప్పులో దర్శనమిచ్చారు. ఈ గెటప్పుల వెనుక ఓ కథ కూడా ఉందండోయ్. రాజమౌళికి తన గురువుగారు తీసిన 'కొండవీటి సింహం' సినిమాలో ఎన్టీఆర్ వేషధారణ అంటే ఇష్టం. రాఘవేంద్రరావుకేమో తన సినిమాలోని ఓ అరబ్బు షేకు వేషమంటే మక్కువ. అందుకే... ఈ అవతారాల్లో దిగిపోయారు. ఫొటో బాగుంది కదూ! వీళ్ల థీమ్ మరీ బాగుంది కదా. ఇక మీరూ ఇలాంటి ఆలోచనలు చేయండి!


Click it and Unblock the Notifications











