హాట్ టాపిక్: పూరీ అసెస్టెంట్ గా రాజమౌళి
ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం నిన్న గురువారం రాత్రి బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి అన్నమాటలే. రాజమౌళి మాట్లాడుతూ -''రెండేళ్లు సినిమా తీయడం కాదు. పూరి జగన్నాథ్‌లా ఆరు నెలల్లో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని నా శ్రీమతి అంటూ ఉంటుంది. అందుకే ఆయన దగ్గర రెండు సినిమాలకైనా అసిస్టెంట్‌గా పనిచేయాలని ఉంది అనేది. ఈ మాటలు సరదాకి రాజమౌళి అన్నా నిజం చాలా ఉంది అంటున్నారు. ఒక్కో సినిమాకు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి పెద్ద దర్శకులు రెండు సంవత్సరాలు టైమ్ తీసుకుంటున్న నేపద్యంలో పూరీ జగన్ కేవలం 74 రోజుల్లో 84,000 అడుగుల ఎక్స్ పోజర్ తో షూటింగు పూర్తి చేశారు. దాంతో మహేష్ కెరీర్ లో ఇదే పెద్ద రికార్డుగా మారింది.
ప్యాచ్ వర్క్ సహా డిసెంబర్ 10 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. హీరో మహేష్ ఈ సినిమా కోసం 65 రోజులు వర్క్ చేశారు. హీరోయిన్ కాజల్ 30 రోజులు షూటింగ్ చేసిందన్నారు. అందరి సహకారంతో ఇంత పెద్ద సినిమాని రికార్డు టైంలో కంప్లీట్ చేయగలిగామని దర్శకుడు చెప్పారు. ఇలా చేయటం వల్ల బడ్జెట్ చాలా కంట్రోలులో ఉంటుంది. అంతేగాక హీరో సైతం మరో చిత్రం ఇమ్మీడియట్ గా చేయటానికి అవకాశం కలుగుతుంది. అందుకే ఇప్పుడు రాజమౌళి మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అందరూ తక్కువ రోజుల్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చే డైరక్టర్ కే ఓటు వేస్తారు. అలాగే ఆ చిత్రం సూపర్ హిట్టైతే దానికి తిరుగుండదు.


Click it and Unblock the Notifications











