»   »  గూగుల్ క్యాంపస్‌లో రాజమౌళి (వీడియో)

గూగుల్ క్యాంపస్‌లో రాజమౌళి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి' సినిమా సూపర్ హిట్ తర్వాత నేషనల్ సెలబ్రిటీ అయ్యాడు. ప్రముఖ కంపెనీలు ఆయన్ను తమ కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ తన క్యాంపస్ కు రాజమౌళిని ఆహ్వానించింది.

దర్శకుడు రాజమౌళితో పాటు బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ గూగుల్ క్యాంపస్ కు వెళ్లారు. గూగుల్ క్యాంపస్, ఇక్కడి వర్క్ కల్చర్ నన్ను ఎంతో ఇంప్రెస్ చేసిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. గూగుల్ సంస్థ ఉద్యోగులతో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. వారంతా ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు.

Rajamouli at Google campus

ఈ సందర్భంగా రాజమౌళి గూగుల్ సంస్థలో ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు జారుతూ వచ్చేందుకు ఏర్పాటు చేసిన దాని పై నుండి జారుతూ కిందకు వచ్చారు. రాజమౌళి రాకతో గూగుల్ సంస్థ ఉద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా రాజమౌళి వారితో బాహుబలి 2 సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

So this is how Google employees get down from 1st floor to ground floor!Quite impressed with the campus and work...

Posted by SS Rajamouli on Friday, September 4, 2015
English summary
"So this is how Google employees get down from 1st floor to ground floor! Quite impressed with the campus and work culture Google. Shobu garu and I had a fun Q/A session with inquisitive Googlers. Thank you guys for the good time." Rajamouli said.
Please Wait while comments are loading...