»   » ఎనిమీస్...పాక్ ప్రజల ముందే రాజమౌళి సంచలనం (పాకిస్థాన్ టూర్ ఫోటోస్)

ఎనిమీస్...పాక్ ప్రజల ముందే రాజమౌళి సంచలనం (పాకిస్థాన్ టూర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఎనిమీస్...పాక్ ప్రజల ముందే రాజమౌళి సంచలనం

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లింది. భారతీయ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్ల మార్కును అందుకున్న తొలి చిత్రంగా రికార్డుల కెక్కిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ రేంజికి భారతీయ సినిమా ఖ్యాతిని విస్తరించేలా చేసింది.

ఈ చిత్రం వివిధ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింతం కావడంతో రాజమౌళి ఆయా దేశాలు పర్యటించారు. తాజాగా బాహుబలి 'పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌'లో ప్రదర్శితం అవుతోంది. ఫెస్ట్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు జక్కన్న కరాచీ వెళ్లారు.

పాక్ ప్రజల ముందే... మీరు మా ఎనిమీస్ అంటూ రాజమౌళి సంచలనం

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాజమౌళి అక్కడి ఆర్టిస్టులు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్ మీద మీ అభిప్రాయం ఏమిటి... అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు. చిన్నతనంలో పాకిస్థాన్ అంటే శత్రువుగా చూసేవాళ్లం. వసీమ్ అక్రమ్ మాకు బిగ్గెస్ట్ విలన్. అయితే పెద్దయ్యే కొద్ది ఆ అభిప్రాయం మారింది. మనమంతా సేమ్ పీపుల్ అని అర్థమైంది... అని రాజమౌళి తెలిపారు.

 సోషల్ మీడియాలో రాజమౌళి పాకిస్థాన్ పర్యటన ఫోటోస్

సోషల్ మీడియాలో రాజమౌళి పాకిస్థాన్ పర్యటన ఫోటోస్

పలువురు పాకిస్థాన్ సినీ నటులు, అభిమానులు రాజమౌళితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాద్యమాల్లో ఇందుకు సంబంధించిన ఫోటోల్ వైరల్ అయ్యాయి.

 రాజమౌళితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి

రాజమౌళితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి

రాజమౌళితో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు పాక్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఆసక్తి చూపారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను తమ తమ ఖాతాల ద్వారా పంచుకుననారు.

రాజమౌళి ఎగ్జైట్మెంట్

రాజమౌళి ఎగ్జైట్మెంట్

పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావాలని ఆహ్వానం అందగానే రాజమౌళి ఎంతో ఆనందానికి గురయ్యారు. తొలిసారిగా పాకిస్థాన్ వెళ్లే అవకాశం దొరకడంతో ఆయన ఎగ్జైట్మెంటుకు గురయ్యారు.

 ఉత్సాహంగా పాకిస్థాన్ వెళ్లిన రాజమౌళి

ఉత్సాహంగా పాకిస్థాన్ వెళ్లిన రాజమౌళి

పాకిస్థాన్ వెళ్లే ముందు రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'బాహుబలి' చిత్రం వల్ల వివిధ ప్రదేశాల్లో పర్యటించే అవకాశం దక్కింది. అయితే వాటన్నింటికంటే ఇపుడు పాకిస్థాన్లో ట్రావెల్ చేయడం మరింత ఎగ్జైటింగ్‌గా ఉంది. నన్ను ఆహ్వానించిన 'పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, కరాచీ' వారికి ధన్యవాదాలు అని రాజమౌళి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Rajamouli was invited to the Pakistan International Film Festival and the director was quite excited about his trip to the neighboring nation. Rajamouli is currently in Pakistan speaking at the Pakistan International Film Festival about the experiences of making Baahubali and the kind of warmth the nation has for Pakistani artists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X