»   » వాడిమాట వినొద్దు, ఉగ్రవాదుల కంటే ప్రమాదం: రాజమౌళి కామెంట్ ఎవరి గురించి?

వాడిమాట వినొద్దు, ఉగ్రవాదుల కంటే ప్రమాదం: రాజమౌళి కామెంట్ ఎవరి గురించి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రాజమౌళి ఏదైనా కామెంట్ చేశాడంటే దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది, ఆయన ఏదైనా చెప్పాడంటే... ప్రజల్లో అవును నిజమే కదా? దాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలే వస్తాయి కదా? అని ప్రజలు ఆలోచించే ఉన్నత స్థాయిలో ఉన్నారు రాజమౌళి. అందుకు కారణం ఆయన వ్యక్తిత్వం కొవొచ్చు, సినిమాల ద్వారా ఆయన సంపాదించిన ఫేం కూడా కావొచ్చు.

అందుకే ఏదైనా ఎవేర్‌నెస్ కార్యక్రమాలు జరిగితే రాజమౌళిని ఆహ్వానిస్తుంటారు. తాజాగా హైద్రాబాద్ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవేర్‌నెస్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి స్పీచ్ ఆకట్టుకుంది.

ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం

ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.... ఉగ్రవాదుల కంటే ట్రాఫిక్ రూల్స్ పాటించని వారే చాలా ప్రమాదకారులని పేర్కొన్నారు. దేశంలో సంవత్సరానికి టెర్రరిస్టు దాడుల్లో 200 మంది చనిపోతే... రోడ్డు ప్రమాదాల్లో లక్షల మంది చనిపోతున్నారని ఆయన అన్నారు.

SS Rajamouli opens up about his next film | Filmibeat Telugu
చిన్న తప్పుకు భారీ మూల్యం

చిన్న తప్పుకు భారీ మూల్యం

రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, వేగంగా న‌డ‌ప‌డం, రాంగ్ రూట్లో వెళ్ల‌డం వంటి చిన్న చిన్న త‌ప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఎన్నో ప్రాణాలు కాపాడినవారమవుతామన్నారు.

యువత స్పీడు గురించి

యువత స్పీడు గురించి

ఈ రోజుల్లో యువత అన్ని విషయాల్లో చాలా స్పీడుగా ఉంటున్నారు. చదువు, టెక్నాలజీ, అభివృద్ధి విషయంలో పోటీ పడుతున్నారు. ఈ విషయాల్లో వేగం మంచిదే, కానీ రోడ్డు మీద మాత్రం వేగం వద్దు, అతివేగం కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతుందని రాజమౌళి అన్నారు.

అక్కడ అభివృద్ధి ఇంకా రాలేదు

అక్కడ అభివృద్ధి ఇంకా రాలేదు

ఒక‌ప్ప‌టితో పోలిస్తే టెక్నాల‌జీలో వ‌చ్చినంత అభివృద్ధి ర‌వాణా రంగంలో రాలేద‌ని, ఆ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొని మ‌ట్టి రోడ్ల మీద‌, సందుల్లో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని దర్శకుడు రాజమౌళి సూచించారు.

వాడి మాట వినొద్దు

వాడి మాట వినొద్దు

తాగి ఉన్న‌పుడు మ‌న‌లో ఉన్న అప‌రిచితుడు మ‌న‌ల్ని డ్రైవింగ్ చేయ‌మంటాడ‌ని, రోడ్డు మీద మన సత్తా చూపాలని రెచ్చగొడతాడు.... ఆ సమయంలో వాడి మాట అస్సలు వినొద్దు, అపుడు క్యాబ్‌లో గానీ, బ‌స్సులోగానీ వెళ్లడమే చాలా సురక్షితం, మనం జాగ్రత్తగా ఇంటికి రావాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు అని రాజమౌళి అన్నారు.

English summary
SS. Rajamouli, the director of Baahubali, today attended the Traffic awareness program and he made sure that everyone will understand how important the traffic regulations are in a very strong way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu