నేను అదృష్టం కంటే కృషినే నమ్ముతాను కాని...రాజమౌళి
నేను అదృష్టం కంటే కృషినే నమ్ముతాను.కానీ తన తొలి చిత్రానికి మంచి బృందం దొరకటం ఆది అదృష్టమే అన్నారు ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి.ఆయన సాయికుమార్ హీరోగా నటించిన 'ప్రేమ కావాలి'చిత్రం యాభై రోజుల వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలా స్పందించారు.అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ...''హీరోగా తొలి విజయం అందుకోవడం కంటే ఆనందం వేరేదీ ఉండదు.
ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం అన్నారు.ఆ తర్వాత నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ ...''50, 75, 100 లాంటి మాటలు చిత్ర పరిశ్రమలో తక్కువగా వినబడుతున్నాయి. ఈ సమయంలో మా చిత్రం 83 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉంది. దర్శకులు విజయ్‌భాస్కర్ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దారన్నారు.


Click it and Unblock the Notifications











