హీరోయిన్ ను బహిష్కరించడం కచ్చితంగా అనాగరికమే..రాజమౌళి

By Sindhu

గ్లామర్ డాల్ నిఖిత హాయ్" చిత్రంలో ఆర్యన్ రాజేష్ సరసన నటించింది. తర్వాత 'సంబరం" షూటింగ్ టైమ్ లో నిఖితపై పీకల్లోతు ప్రేమను పెంచేసుకుని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి సైతం సిద్దపడిపోయిన దర్శకుడు దశరథ్ సైతం నిఖితను కన్నడలో నిషేధించడంపై బహిరంగంగా విమర్శించలేకపోయాడు. ఆమెకు ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతి మాత్రమే తెలిపాడు. కానీ రాజమౌళి మాత్రం తీవ్రంగా స్పందించాడు. ఎవరైనా ఒక హీరోయిన్ ఒక హీరోతో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణ వస్తే..సదరు హీరోయిన్ ను చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించడం ఎంతవరకు సబబు అని ముక్కు సూటిగా ప్రశ్నించాడు. సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పోయకూడదనే ఇంగిత జ్ఞానం హీరోయిన్లకే కాదు, ఏ ఆడదానికైనా ఉండాల్సిందే. అలా అని అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణ వచ్చిన కారణంగా ఓ హీరోయిన్ ను బహిష్కరించడం కచ్చితంగా అనాగరికమే..

హీరోయిన్ నిఖిత తన భర్తతో అక్రమసంబంధం పెట్టుకుని..తమ కాపురం సక్రమంగా సాగకుండా చేస్తున్నదంటూ కన్నడ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్శన్ ను అరెస్ట్ చేశారు కూడా. దీనిపై అనూహ్యంగా కన్నడ నిర్మాతల మండలి స్పందించింది. దర్శన్ కాపురంలో చిచ్చు పెడుతున్న నిఖతను మూడేళ్లపాటు ఎవరూ తీసుకోరాదంటూ తీర్మానం చేసింది.

అయితే నిఖిత స్పందిస్తూ నేను గత ఆరు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. మంచి విల్ సంపాదించుకొన్నాను. అయితే ఎవ్వరితో అక్రమ సంబందాలు పెట్టుకో లేదు..అంత అవసరమూ నాకు లేదు అన్నారు. ఒక వేళ దర్శన్, అతని భార్య కు ఏవైనా ప్రాబ్లెమ్స్ ఉంటే వారినే పరిష్కరించుకోమనండి అంతే కానీ అనవసరంగా నన్ను ఎందుకు ఇందులోకు లాగారంటూ ప్రముఖ చానల్లో టెలిపోన్ లో మాట్లాడారు. ఈ తరహా తీర్మానాలు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం వంటి భాషల్లోనూ అమలు చేస్తే ఎంతమంది హీరోయిన్లను బ్యాన్ చేయాల్సి ఉంటుందో ఎవరైనా చెప్పగలరా....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X