twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ‘బాహుబలి’ లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజవౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం మే 15 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటిలో సెట్స్ రెడి చేస్తున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో ప్రభాస్,సత్యరాజ్ ల మధ్య సీన్స్ ఉండబోతున్నాయని పిల్మ్ నగర్ సమాచారం.

    'బాహుబలి' కోసం భారీగా గడ్డం, కోరమీసాలు పెంచుతున్నారు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం.

    ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

    'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమారాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.

    English summary
    Rana, Prabhas, Anushka starer Bahubali's regular shooting will be starting from May 15th. Film makers already started erecting extravagant sets in RFC. Rajamouli is directing the fim in which Satya Raj is playing an important role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X