రాజమౌళి తాపత్రయం అంతా అందుకే...!
రీసెంట్ గా విడుదలైన 'వేదం" చిత్రం గురించి రాజమౌళి ట్విట్టర్ లోనూ, క్రిష్ తో పాటు పాల్గొన్న రాజమౌళి టీవీలో ఇంటర్వ్యూలో నూ చాలా గొప్పగా చెప్పారు..బాగా ప్రమోట్ చేశారు. అయితే ఆయనంత తాపత్రయపడింది తన 'మర్యాద" కాపాడుకోవడానికే అనేది ఇండస్ట్రీ టాక్. వివరాల్లోకి వెళితే..'వేదం" నిర్మాన సంస్థ అయిన ఆర్కామీడియా బేనర్ లోనే ప్రస్తుతం 'మర్యాద రామన్న" సినిమా చేస్తున్నారు రాజమౌళి. తను టాప్ డైరెక్టర్ అయినప్పటికీ ఈ సినిమా రెమ్యూనరేషన్ ని మాత్రం వచ్చే లాభాల్లో వాటాగానే తీసుకుంటానని రాజమౌళి చెప్పారట.
కాగా ఆల్ రెడీ రాజమౌళి సినిమాగా 'మర్యాద రామన్న"కి మంచి బిజినెస్ క్రేజ్ వచ్చేసింది. ఈ దశలో వేదం ఫలితం తారుమారైతే రికవరీ కోరే పంపిణీదారులందరూ 'మర్యాద రామన్న" పై పడతారు కనుక ఎలాగైనా ఆ సినిమాని గట్టెక్కించాలనే ప్రయత్నంలో రాజమౌళి కూడా పాలుపంచుకున్నారని. మాట సాయం చేశారని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే..'వేదం" లావాదేవీలేమైనా వుంటే మళ్ళీ క్రిష్ సినిమాతోనే చూసుకుందాం అన్నట్టు ఇదే సంస్థలో క్రిష్ మరో సినిమా చేస్తారనే ప్రకటన కూడా రావడం..!


Click it and Unblock the Notifications











