వేరే డైరక్టర్ సినిమా నచ్చి షేర్ తీసుకున్న రాజమౌళి
ఏలేటి చంద్రశేఖర్ శిష్యుడు హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయవుతున్న చిత్రం 'అందాల రాక్షసి'. మొన్నా మధ్యన ఆడియో విడుదలైన ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు. ఆగస్టు 10న ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం. ఈగ నిర్మాత సాయి కొర్రపాటి తమ వారాహి చలన చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఈ చిత్రం పాటలను,ఫస్ట్ లుక్ ట్రైలర్ ని విడుదల చేసారు.
ఈ చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ...బాండ్ పేపర్ మీద రాసిస్తాను... హను కచ్చితంగా గొప్ప దర్శకుడు అవుతాడు. ఇది నా సినిమాలాంటిదే. ఐదేళ్ల క్రితం హను రూపొందించిన షార్ట్ ఫిల్మ్ చూశాను. అత్యద్భుతంగా రూపొందిన లఘు చిత్రాల్లో అదొకటి అన్నారు దర్శకుడు రాజమౌళి.
దర్శకుడు హను మాట్లాడుతూ... సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య ఓ ప్రేమ కథ జరిగితే ఎలా ఉంటుందో మా సినిమాలో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ కూడా అలానే ఉంటుంది. 1990ల్లో జరిగిన ప్రేమ కథ ఇది. ఓ అందమైన దృశ్య కావ్యంలా చూపించే ప్రయత్నం చేశాం. రధన్ అందించిన స్వరాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. సంగీత దర్శకుడు మాట్లాడుతూ ''మధురమైన బాణీలు ఇవ్వడానికి సరిపోయే ఓ చక్కటి ప్రేమ కథ ఇది''అన్నారు.
నవీన్, రాహుల్, లావణ్య ప్రధాన పాత్రల్లో హను రాఘవపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'అందాల రాక్షసి'. రధన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications












