నాగార్జున గెటప్ పై రాజమౌళి కామెంట్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎప్పటికప్పుడు తన మనస్సులో మాటలను ట్విట్టర్ లో ట్వీట్ రూపంలో మన ముందుంచుతున్నారు. తాజాగా ఆయన నాగార్జున గురించి ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ...నాగార్జున గారు న్యూ లుక్ టెర్రఫిక్ గా ఉంది. షిర్జీ సాయిబాబా తర్వాత ఆయన చాలా ఆశ్చర్యంగా ట్రాన్మర్మేషన్ అయ్యారు. స్టైయిల్ అదిరిపోయింది అన్నారు. నాగార్జున తాజాగా చేస్తున్న లవ్ స్టోరీ చిత్రం కోసం కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఆ గెపట్ పై రాజమౌళి ఇలా స్పందించారు.
ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'రిలీజ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. వచ్చే నెల 6 న చిత్రం విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమింళంలో 'నాన్ ఈ' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ శాటిలైర్ రైట్స్ ఓ రేంజిలో పలికి అందరికీ షాక్ ఇచ్చింది. తమిళంలో నెంబర్ వన్ ఛానెల్ అయిన సన్ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 3.35 కోట్లుకు కొనుగోలు చేసారు. ఓ తెలుగు డైరక్టర్ డైరక్ట్ చేసిన చిత్రానికి ఈ రేంజి రేటు పలకటం తమిళ శాటిలైట్స్ హిస్టరీలోనే ఓ పెద్ద రికార్డు అంటున్నారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా నిర్మిస్తోంది.
'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా ' ఈగ' కథాంశం.
నాని, సమంత, సుదీప్ కీలక పాత్రలను పోషించిన ఈ సినిమా వారాహి చలనచిత్రం పతాకంపై రూపొందింది. ఓ కొత్త పాయింట్‌తో, ఆసక్తికరమైన కథనంతో తయారవుతున్న 'ఈగ' సినిమా మీదే ఇప్పుడందరి దృష్టి ఉంది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న 'ఈగ' చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్.రవీందర్, స్టైలింగ్: రమా రాజమౌళి, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత: సాయి కొర్రపాటి, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్ .ఎస్. రాజమౌళి.


Click it and Unblock the Notifications











