రాజమౌళి కాస్టింగ్ కాల్‌కు....దిమ్మదిరిగే రెస్పాన్స్
రాజమౌళి కాస్టింగ్ కాల్‌కు దిమ్మ దిరిగే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే వేలాది అప్లికేషన్స్ వచ్చి పడ్డాయి. రాజమౌళి ప్రకటన విడుదల చేసిన రెండు రోజుల్లోనే 3 వేల అప్లికేషన్స్ వచ్చాయంటే రెస్పాన్స్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ల నుంచి తమకు కావాల్సిన వారిని సెలక్ట్ చేసేందుకు స్పెషల్ టీం పని చేస్తుంది. వారు సెలక్ట్ చేసిన వారిని మల్లీ ఫిల్టర్ చేసి రాజమౌళి ఫైనల్ చేయనున్నారు.
సినిమా వివరాల్లోకి వెళితే....ప్రస్తుతానికి ఈచిత్రాన్ని 'బహుబలి' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ప్రభాస్ కు పత్యర్థిగా విలన్ పాత్రలో రాణా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థపై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్‌కు తరలించనున్నారని కూడా సమాచారం.


Click it and Unblock the Notifications












