డైరెక్టర్ రాజమౌళి బచ్చా...!(ఓ లుక్కేయండి)
టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ రాజమౌళి అపజయం అంటూ ఎరుగకుండా దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. మనోడు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టి విజయం వెతుక్కుంటూ మరీ వస్తోంది. స్టార్ హీరోలను పెట్టి సినిమా తీసినా, స్టార్ ఇమేజ్ లేని వాళ్లతో చేసినా..అసలు హీరో లేకుండా ఈగల్ని పెట్టి తీసినా జనాలు ఎగబడి చూస్తున్నారు. మరి ఆయన సినిమాల్లో ప్రేక్షకులకు కావాల్సిన విషయం ఉంది కాబట్టే ఆయన అందనంత ఎత్తుకు ఎదిగి పోయారు.
ఆ విషయాలు పక్కన పెడితే...రాజమౌళి తన చిన్న నాటి ఫోటోను ఇటీవల విడుదల చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఇదే. మనోడు బచ్చాగా ఉన్నప్పుడు కూడా సినిమాల గురించి తెగ ఆలోచిస్తున్నట్లు ఉంది కదూ. పక్కనే తెల్ల చొక్క వేసుకున్న ఇద్దరు రాజమౌళి స్నేహితులు. ఎదురుగా పూల చొక్కా వేసుకున్నది రాజమౌళి అన్నయ్య కాంచి అని స్పష్టం అవుతోంది.
ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే...ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించింది. ఈ గ్రాఫిక్స్ వండర్ మూవీ తెలుగు సినిమా పరిశ్రమ కీర్తిని నలు దిశలా చాటడమే కాదు, కాసుల వర్షం కురిపించి రాజమౌళికి మంచి పేరును తెచ్చింది. రాజమౌళి ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











