చిరంజీవితో సినిమాపై రాజమౌళి స్పందన
ప్రముఖ దర్శకుడు రాజమౌళి..చిరంజీవితో 150 వ చిత్రాన్ని మూడు భాషల్లో ప్లాన్ చేస్తున్నారని న్యూస్ లు వచ్చాయి.అంతేకాక ఆ సినిమాని 110కోట్లు తో భారీగా తీయబోతున్నారని మీడియాలో వినిపించింది.దీనిపై రాజమౌళి ట్విట్టర్ లో స్పందిస్తూ..110 కోట్లా..ఏంటవి..రూపాయలా..బఠానీలా..నాకు అందులో సగం ఎమౌంట్ నా ప్రొడ్యూసర్ ఎలౌట్ చేసినా ఆనందపడతాను.రెండు భాషల్లో తీయటానకే చుక్కలు కనిపిస్తున్నాయి..మళ్లీ మూడు భాషల్లోనా..నో..దాంక్స్ అంటూ ఫన్నీగా ట్వీట్ చేస్తూ ఖండించారు.ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం బిజీలో ఉన్నారు.ఈగ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో రూపొందుతోంది.
సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు.
అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.


Click it and Unblock the Notifications











