హీరోయిన్ ఎంపిక రూమర్స్ పై రాజమౌళి
రీసెంట్ గా ఈ చిత్రంలో 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ పెద్ద మరదలు పాత్రలో నటించిన హీరోయిన్ ప్రణీత కి ఆఫర్ వచ్చిందనే వార్తలు మీడియాలో హల్ చల్ చేసాయి. అయితే ఇది నిజం కాదని రాజమౌళి ఖండించారు. ఆయన ట్వీట్ లో... మేం ప్రణీతను బాహుబలి కోసం ఎప్రోచ్ కాలేదు. అది కేవలం రూమరే అని తేల్చారు.
ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ షూటింగ్ కేరళలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.
ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












