సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి యాంకరింగ్ మగధీర రేంజ్ లో....
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. స్టూడెంట్ నెం.1 తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన రాఘవేంద్ర రావు శిశ్యుడు రాజమౌళి తన గురువు బాటలోనే నడుస్తున్నాడు. రాఘవేంద్రరావు బుల్లితెరపై సీరియళ్లు నిర్మించినట్టు, రాజమౌళి బుల్లితెరపై యాంకరింగ్ చేయబోతున్నారు. హెచ్.ఎం.టీవి న్యూస్ ఛానెల్ లో రాజమౌళి యాంకర్ గా కనిపించనున్నారు. భారత దేశంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గంలో కలిగే లోటు పాటులు వంటి అంశాల మీద ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ కు యాంకర్ గా చేస్తారు.
ఇప్పటికే జూ ఎన్టీఆర్, నాగార్జున, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ వంటి పదహారు మంది ప్రముఖులతో పదహారు ఎపిసోడ్స్ రికార్డు చేశారు. సెప్టెంబర్ 9 నుంచి ఈ ఎపిసోడ్స్ ను ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమాన్ని ప్రకాష్ రాజ్ చేయాలనుకున్నారు. కానీ అన్యూహ్యా కారణాల మధ్య దర్శకుడు రాజమౌళి అంగీకరించారు. దీని కోసం రాజమౌళికి పెద్ద మొత్తంలోనే రెమ్యూనరేషన్ హెచ్.ఎం.టీవి ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











