»   » డబ్బు పంచలేదని విన్నా: బాలయ్యపై రాజమౌళి కామెంట్స్

డబ్బు పంచలేదని విన్నా: బాలయ్యపై రాజమౌళి కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బాలయ్య ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఆయన ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి డబ్బు పంచలేదని విన్నాను. అదే నిజమైతే ఆయనకు నా రెస్పెక్ట్' అంటూ రాజమౌళి తన ఫేస్ బుక్ పేజీలో కామెంట్ చేసారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ పై కూడా రాజమౌళి ఇలా రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కామెంట్ చేసారు. 'ఒక వేళ ఎన్నికల ఫలితాలు అనుకున్న విధంగా రాక పోతే భవిష్యత్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్‌కు ముందే తెలుసు. కానీ ఆయన వాటిని లెక్క చేయలేదు. తాను నమ్మిన విధానాలతోనే ముందుకు సాగారు. సొంతగా పార్టీ స్థాపించినప్పటికీ టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించడానికే ఎన్నికలకు దూరంగా ఉండటం అనేది చరిత్రలో నిలిచిపోయే అంశం. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయని ఆశిస్తున్నాను' రాజమౌళి వ్యాఖ్యానించారు.

 Rajamouli comment on Bala Krishna

మరో వైపు రాజమౌళి ప్రచార బాధ్యతలు చేపట్టిన లోకసత్తా పార్టీ ఎన్నికల్లో పరాభవం పాలైన సంగతి తెలిసిందే. ఈ విషయమై రాజమౌళి స్పందిస్తూ...'లోక్ సత్తా పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగించడంలో మేము పూర్తిగా విఫలం అయ్యాయి. జయప్రకాష్ నారాయణ, లోక్ సత్తా పార్టీ మనీ పవర్ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకం అని నమ్మి ఓటు వేసిన లక్షన్నరకుపైగా ఓటర్లకు సిన్సియర్‌గా థాంక్స్ చెబుతున్నాను' అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు.

English summary
"Heard from a close aide that Balakrishna garu didn't allow money to be distributed for votes in Hindupur. If that is really true, RESPECT!" Rajamouli said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu