బాగా వాడేసారుగా..... ‘సాహో’ ఫస్ట్ లుక్ మీద రాజమౌళి కామెంట్
ఫస్ట్ లుక్ పోస్టర్లో కలర్స్, టెక్స్చర్స్ ను చాలా అందంగా వాడారు, సూపర్ స్టైలిష్ సాహో' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
Recommended Video

Rajamouli Tweeted On "Sahoo" First Look ‘సాహో’ ఫస్ట్ లుక్ మీద రాజమౌళి కామెంట్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సాహో' ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ లుక్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. దీనిపై తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించారు.
'ఫస్ట్ లుక్ పోస్టర్లో కలర్స్, టెక్స్చర్స్ ను చాలా అందంగా వాడారు, సూపర్ స్టైలిష్ సాహో' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. 'సాహో' సినిమా కంటే ముందు రాజమౌళి, ప్రభాస్ కలిసి ఇండియాలోనే అతి పెద్ద సినిమా ప్రాజెక్ట్ 'బాహుబలి' సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూవి క్రియేషన్స్ వారే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











