»   »  'బాహుబలి' :అస్కార్ పై రాజమౌళి కామెంట్

'బాహుబలి' :అస్కార్ పై రాజమౌళి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా రాజమౌళి డైరక్ట్ చేసిన బాహుబలి చిత్రం అంతర్జాతీయ స్ధాయి చిత్రమని, హాలీవుడ్ స్టాడర్డ్స్ లో నిర్మించారనే టాక్. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాసముందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్ట్ లు పెడుతున్నారు. మీడియాలో కూడా బాహుబలికి ఆస్కార్ వచ్చే అవకాసం ఉందని వినపడుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ విషయమై రాజమౌళి స్పందిస్తూ...ఎప్పటిలాగే ఓ నవ్వుతూ...అసలు తాను ఆస్కార్ రావటం గురించి ఆలోచించటం లేదని అన్నారు. గతంలో ఈగ సినిమా అప్పుడు కూడా అస్కార్ వస్తుందని అంచనాలు వేసారు. భారత్ దేశం నుంచి ఆస్కార్ కి పోటీ పడిన వాటిలో ఈగ కూడా ఉంది. అలాగే ఇప్పుడు బాహుబలి కూడా ఉంటుందనటంలో సందేహం లేదు.

 Rajamouli

ఇక బాహుబలి @ 500 కోట్లు

అందరూ అంచనా వేసినట్లుగానే.. 'బాహుబలి'ఐదొందల కోట్ల క్లబ్‌లో చేరింది. గత నెల 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో పాటు బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు సినిమాగా 'బాహుబలి' నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో కొనసాగుతున్న 'బాహుబలి' జైత్రయాత్రలో మరో మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ బాలీవుడ్‌ బాక్సాఫీసు వంద కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించింది. ఆదివారం నాటికి రూ. 103.51 కోట్లు వసూలు చేసింది.

బాలీవుడ్‌.. 'బాహుబలి'.. రూ.100కోట్లు..

'బాహుబలి' చిత్ర రికార్డుల పర్వం కొనసాగుతోంది. విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్‌లలో సరికొత్త రికార్డులను సృష్టించింది. బాలీవుడ్‌లో రూ.100 కోట్ల వసూళ్లు దాటిన ఏకైక డబ్బింగ్‌ చిత్రంగా 'బాహుబలి' నిలిచింది.

గత ఆదివారంతో ముగిసిన నాలుగో వారం కలెక్షన్‌లతో 'బాహుబలి' రూ.103.51 కోట్లకు చేరిందని బాలీవుడ్‌ సినీ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. చిత్రాన్ని హిందీలో సమర్పించిన ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత నిర్మాత కరణ్‌ జోహార్‌ దర్శకులు రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ చిత్రం 'బజరంగీ భాయ్‌జాన్‌' థియేటర్లలో ఉన్నా.. 'బాహుబలి'కి కలెక్షన్‌లు తగ్గక పోవడం గమనార్హం.

మరో ప్రక్క...

'బాహుబలి' బ్రాండ్‌ విలువని పెంచేందుకు, చిన్న పిల్లల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచేందుకు ఇప్పుడు 'బాహుబలి' బొమ్మల్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ నడిచే చిత్రమిది.

'బాహుబలి', 'భళ్లాలదేవ', 'దేవసేన', 'శివగామి', 'అవంతిక'.. ఇలా ఒకొక్క పాత్రకూ ఒక్కో విశిష్టత ఉంది. ఆపాత్రల్ని పోలిన బొమ్మల్ని రూపొందించి, త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

వాటితోపాటు 'బాహుబలి' వీడియో గేమ్స్‌నీ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని అంతర్జాతీయ సంస్థలతో 'బాహుబలి' చిత్రం యూనిట్ చర్చలు జరుపుతోంది. హాలీవుడ్‌లో 'స్పైడర్‌మేన్‌', 'సూపర్‌మేన్‌' సిరీస్‌ సినిమాలు విడుదల చేసే సమయంలో ఆ పాత్రల్ని పోలిన బొమ్మలు, వీడియో గేమ్స్‌, కొన్ని వినియోగ వస్తువులు మార్కెట్‌లో విడుదల చేస్తుంటారు.

అటు ప్రచారం, ఇటు వ్యాపారం రెండూ జరిగిపోతుంటాయి. అదే వ్యూహాన్ని 'బాహుబలి' కోసం అనుసరిస్తున్నారు రాజమౌళి. వచ్చే ఏడాది జనవరిలోగా ఈ బొమ్మలు మార్కెట్‌లోకి వస్తాయి.

English summary
Rajamouli laughs off the Oscar buzz and said that he is not at all thinking about getting an Academy Award.
Please Wait while comments are loading...