సమంతపై గాసిప్స్...రాజమౌళి క్లారిటీ!
అనారోగ్యం పాలైన సమంత చాలా రోజులుగా షూటింగులకు హాజరు కాక పోవడంతో రకరకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అనరోగ్యం మూలంగా సమంత చాలా ప్రాజెక్టులు వదులుకోవాల్సి వచ్చిందని, ఎవడు చిత్రంలో కూడా సమంతను తీసేసారని గాసిప్స్ వినిపించాయి.
అయితే ఇవన్నీ నిజం కాదని, సమంతపై రూమర్స్ నమ్మ వద్దని అంటున్నారు దర్శకుడు రాజమౌళి. తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా సమంత ప్రస్తుతం బాగానే ఉందని, ఆమె మళ్లీ షూటింగుల్లో పాల్గొంటోంది. ఆమెకు అంతా మంచి జరుగాలి అంటూ ఆమె తాజా ఫోటోను పోస్టు చేశారు.
ఇటీవల సమంత నటించిన ఈగ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణం ఈగ ప్రమోషన్లలోకూడా పాల్గొన లేక పోయింది. ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ షూటింగులకు హాజరవుతోంది.
సమంత ప్రస్తుతం బోలెడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. గౌతం మీనన్ దర్శకత్వంలో నాని సరసన ఎటోవెళ్లి పోయింది మనసు, దేవా కట్ట దర్శకత్వంలో నాగచైతన్య సరసన ఆటో నగర్ సూర్య, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధార్థ సరసన ఓ సినిమా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











