»   » శాపమా? మెగా ఫ్యామిలీ గురించి రాజమౌళి కామెంట్స్!

శాపమా? మెగా ఫ్యామిలీ గురించి రాజమౌళి కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కంచె ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హాజరైన స్టార్ డైరెక్టర్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ టాలెంటును మెచ్చుకున్న రాజమౌళి..... మెగా ఫ్యామిలీలో పుట్టడం ఓ వైపు వరం, మరో వైపు శాపం అంటూ వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీనే కాదు ఏ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చినా అప్పటికే ఆ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో ఉన్న వారితో పోలుస్తారు. వరుణ్ తేజ్‌కు కూడా అలాంటి ఇబ్బంది ఉంటుందని తెలుసు, రామ్ చరణ్ ఫైట్స్ చేయాలని, బన్నీలా డాన్స్ చేయాలని అంతా కోరుకుంటారు. ఇలా అంచనాలు తగిన విధంగా ముందుకు పోయినప్పుడే నిలదొక్కుకోవడం సాధ్యం అని వ్యాఖ్యానించారు.

ఇక ‘కంచె' చిత్ర దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడుతూ... క్రిష్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటి వరకు ఆయన చాలా మంచి సినిమాలు చేసారని ప్రశంసించిన రాజమౌళి....ఆయన కమర్షియల్ గా హిట్ కొట్టలేక పోయారంటూ వ్యాఖ్యానించారు. తొలుత రాజమౌళి ప్రశంసలకు పొంగిపోయిన క్రిష్.... తనకు కమర్షియల్ హిట్ లేదని వ్యాఖ్యానించడంతో కుంగిపోయాడని అంటున్నారు.

Rajamouli comments on Varun Tej

వాస్తవానికి రాజమౌళి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. కాక పోతే ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల క్రిష్ కాస్త ఫీలయ్యారని, ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినపుడు ప్లస్ పాయింట్లు మాట్లాడాలే కానీ, ఇలా మైనస్ పాయింట్ల ప్రస్తావన తేవడం అంటూ రాజమౌళి తీరును కొందరు సినీ ప్రముఖులు తప్పుపడుతున్నారు.

English summary
Rajamouli sensation comments on Varun Tej and Krish.
Please Wait while comments are loading...