కె. రాఘవేంద్రరావుగారిపై చిన్న కంప్లైంట్...ఎస్ ఎస్ రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గారి ప్రియతమ శిష్యుడు రాజమౌళి ఆయనపై చిన్న కంప్లయింట్ లాంటిది ఒకటి చెప్పారు. ఓ పాపులర్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ...రాఘవేంద్రరావుగారు.. స్టోరీని ఆయన చాలా సింపుల్‌గా తేల్చేస్తుంటారు. కథలో బలం లేకుండా, కథనం ఎంత ఆసక్తికరంగా ఉన్నా చివరికొచ్చేసరికి తేలిపోతుంది. ఇది నా అభిప్రాయం.
ఇకపోతే ఆయనలో నాకు బాగా నచ్చేది యన టేకింగ్. ముఖ్యంగా క్లోజప్‌లు ఎవరిపై ఎప్పుడు ఎలా పెట్టాలనేది ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు. రాజమౌళి రాఘవేద్రరావు గారి పర్యవేక్షణలో శాంతినివాసం సీరియల్ కి పనిచేసారు. అలాగే ఆ తర్వాత రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ కి సైతం ఆయన పర్యవేక్షణలోనే చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఈగ అనే ప్రయోగాత్మక చిత్రం రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు.
రాజమౌళి రాఘవేంద్రరావు శాంతినివాసం స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ rajamouli raghavendra rao santhinivasam student no1 ntr


Click it and Unblock the Notifications