అదుర్స్ పై రాజమౌళి జోశ్యం నిజమవుతుందా?
"అదుర్స్ సినిమా 'మగధీర' రికార్డుల్ని దాటాలని కోరుకొనేవాళ్లలో నేను మొదటివాణ్ని. తప్పకుండా దాటుతుంది" అంటూ రాజమౌళి అదుర్స్ ఆడియో పంక్షన్ లో చెప్పటం ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ రకంగా ఇది సవాల్ అని కొద్ది మంది అంటున్నా...అదేమీ కాదు..ఎన్టీఆర్ అదే స్టేజీపై మాకు రికార్డులపై మమకారం లేదని ప్రకటించాడు కదా అని అంటున్నారు. నిజానికి రాజమౌళి పైకి చెప్పినా చెప్పక పోయినా మగధీర రికార్డులను ఎన్టీఆర్ తన చిత్రంతో బ్రేక్ చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే బహిరంగంగా ఆ మనసులో మాటను స్టేజిపై రాజమౌళి చెప్పటంతో కొంత వాతావరణం వేడిక్కెంది. అప్పటికీ వివివినాయిక్ ఈ చిత్రాన్ని అదరిపోయే రీతిలో రూపొందించాడంటున్నారు. కానీ రిలీజ్ దాకా ఏ చిత్రం ఏ పొజీషన్ లో ఉంటుందన్నది ఈ రోజున చెప్పలేని సిట్యువేషన్ ఉంది. వరస ఫ్లాపులను సంవత్సర కాలంగా తెలుగు పరిశ్రమ ఎదుర్కొంటోంది. వీటి నుంచి నిజాయితీగా తప్పించుకున్నవి మగధీర,కిక్, అరుంధతి మాత్రమే. మిగతావాటిల్లో బెండు అప్పారావు లాంటివి ఉన్నా పెద్దగా చెప్పుకునే మెగా హిట్ లు రాలేదు. దాంతో ప్రతీ చిత్రాన్ని ఆ మూడింటితో పోల్చి చూడాల్సిన సిట్యువేషన్ వచ్చిందని సినీ పండితులు అంటున్నారు. మరి సవాల్ ని స్వీకరించి అదుర్స్...మగధీర రికార్డులు బ్రద్దలు కొడుతుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











