ప్రభాస్ విషయంలో రాజమౌళి తర్జనభర్జన...
మగధీర" తర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్ చేయడం కరెక్ట్ కాదనుకున్న రాజమౌళి 'మర్యాద రామన్న" లాంటి చిన్న సినిమా చేశాడు.ఆ సినిమాతో సక్సెస్ సాధించిన రాజమౌళి వెంటనే తన రూట్ లోకి వెళ్లకుండా. తెలివిగా మళ్లీ సినిమాకి గ్యాప్ ఇచ్చాడు. ప్రేక్షకుల నాడి సరిగ్గా తెలిసిన ఏకైక దర్శకుడిగా కితాబులు అందుకుంటున్న రాజమౌళి మళ్ళీ ఏదో ఒక గ్రేట్ ప్లాన్ తో ప్రభాస్ తో చేయడానికి సిద్దపడ్డాడు. అయితే ప్రభాస్ డేట్స్ ఖాళీ తేకపోవడంతో కావాలనే తన కెరీర్ కి తాత్కాలిక బ్రేక్ తీసుకుంటున్నాడు.
'మగధీర" తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసి తను సెట్ చేసుకున్న బెంచ్ మార్క్ ని తనే ఛాలెంజ్ చేసుకోవడం పోయి, సునీల్ తో చిన్న సినిమా తీసి సక్సెస్ అయిందనే టాక్ తెచ్చుకొన్న రాజమౌళి ఇప్పుడ మళ్లీ పూర్తీ గాడితప్పుతున్నాడనిపిస్తోంది. కాగా 'ఈగ" అనే ప్రయోగాత్మక చిత్రం చేయాలని తహతహలాడిపోతూ కమర్షియల్ డైరెక్టర్ అయిన తాను ట్రాక్ మళ్లీ పోతున్నాడు. అంతే కాకుండా నాగార్జున 'రాజన్న" యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్ట్ చేయడానికి కమిట్ అయితన 'స్టామినా" మిస్ అయిపోతున్నాడు. అలాగే ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయాలనే విషయంలోను రాజమౌళి ఇంకా ఒక డెసిషన్ కి రాలేదు. 'మగధీర" మాదిరిగా భారీ సినిమా చేయాలా లేక 'ఛత్రపతి"లా మాస్ సినిమా చేయాలా అని ఇంకా తర్జనభర్జన పడుతున్నాడు.


Click it and Unblock the Notifications











